ఆర్ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి.. సంచలన అరంగేట్రం చేసింది నటి పాయల్ రాజ్పుత్. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది పాయల్. ఈ చిత్రం మంచి హిట్ అందుకున్నప్పటికీ.. పాయల్కి మాత్రం అవకాశాలు వెనుకబడ్డాయి. ఆర్ఎక్స్ 100 చేసిన తరువాత ఆ మధ్యలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది పాయల్. 'ఆర్డీఎక్స్ 100' సినిమాలో అందాలను ఆరబోసినా కానీ.. క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత 'వెంకీ మామ'లో వెంకీ పక్కన నటించి మంచి హిట్ అందుకుంది. కాగా లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటోన్న పాయల్.. సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో ముచ్చటించింది. దీంతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తెలుగులో ఎలాంటి చిత్రాలు చేస్తున్నారో చెప్పమని ఫ్యాన్స్ పదే పదే అడిగారు. కానీ పాయల్ మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. ఇక తెలుగులో మీరు ఎవరితో నటించాని అనుకుంటున్నారన్న ప్రశ్నకు.. ఇమిడియట్గా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పింది. దీంతో ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ వీరిద్దరి కాంబో సెట్ అయితే బావుండని ఆశపడుతున్నారు. అలాగే తన మొదటి చిత్రం హీరో కార్తికేయతో డేటింగ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. కార్తికేయ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. అలాంటిదేమీ లేదని ఆన్సర్ ఇచ్చింది పాయల్.
Tags
Movie News