టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హేమ. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. అక్క, వదిన మొదలగు అన్ని పాత్రల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ హేమ ముందుంటుంది. బోల్డ్గా మాట్లడటంలోనూ, మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా బయట పెట్టడంలో వెనక్కి తగ్గదు. తాజాగా హేమ ఇంటివద్దనే ఉండటంతో సోషల్ మీడియా లైవ్లోని అభిమానులతో కాసేపు మాట్లాడింది.
ఈ క్రమంలోనే
హెయిర్ గురించి పలు చిట్కాలు చెప్పుకొచ్చింది.
దీనికి హేమ ఆయిల్ అనే
పేరు కూడా పెట్టింది. ఈ
ఆయిల్ని తయారు చేసి
మా అమ్మ నాకు రాసేది.
ఇప్పుడు ఆ చిట్కాని ఉపయోగించి
అదే ఆయిల్ నా కూతురికి
కూడా వాడుతున్నట్లు తెలిపింది. అలాగే తయారీ విధంగా
గురించి చెబుతోంది హేమ. ఈ లోపు
మధ్యలో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది.
అందుకు కారణం కొందరు నెటిజన్లు
అసభ్యంగా కామెంట్స్ చేయడటమే. ఈ వయసులో కూడా
హేమ అందంగా ఉంది. నీ వయసు
ఎంత? అన్న ప్రశ్నలు హేమకు
ఆగ్రహం తెప్పించాయి. మాటికొస్తే.. ఈ వయసులో.. ఈ
వయసులో అంటున్నారు. నాకేమైనా 60, 70 ఏళ్లు ఉన్నాయా? నా
కూతురు ఇంటర్ చదువుతోంది. నేను
ఇప్పటికీ యంగే. నా వయసు
తెలుసుకుని ఏం చేస్తావురా? పెళ్లి
చేసుకుంటావా అని ఘాటుగా రిప్లై
ఇచ్చింది.ఈ లోపు మరో నెటిజన్.. ఐ లవ్ యూ బేబీ అని మెసేజ్లు పెడుతూ హేమని ముద్దు అడిగాడు. దీనితో హేమ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఇంటికొచ్చి మరీ తంతా వెధవ.. తిక్క తిక్క వేషాలు నా దగ్గర వేయొద్దు. నేను పైకి ఇలా కనిపిస్తాను. లోపల ఇంకో క్యారెక్టర్ ఉంది. దాన్ని బయటకు తీయొద్దు. పళ్లు ఊడగొట్టి చేతిలో పెడతా.. నా గురించి ఏమనుకుంటున్నావో జాగ్రత్త'.. అంటూ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది హేమ.
Tags
Movie News