I dont have any limitations do for Nude Roles(నగ్నంగా నటించుటకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిన రాధికా ఆప్టే )


అందాల ఆరబోతలోనూ, కెమెరా ముందు ఒంపుసొంపులను ఒలకబోయడం లోనూ మాత్రం వెనకాడటం లేదు నేటితరం హీరోయిన్స్. కథ డిమాండ్ చేయాలే గానీ ఒంటిపై నూలు పోగు లేకుండా కూడా నటించేందుకు రెడీ అంటున్నారు కొందరు యంగ్ హీరోయిన్స్. అందులో ఒకరే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే. ''అహల్య, బద్లాపూర్'' వంటి చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది రాధికా. నేపథ్యంలో ఇటీవలి కాలంలో తనను కలుస్తున్న దర్శకులంతా న్యూడ్ సీన్స్ కోసమే అడుగుతున్నారని తెలుపుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే.

వెండితెరపై నగ్నంగా కనిపించేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిన రాధికా.. కథ, పర్టికులర్ సీన్ డిమాండ్ చేస్తేనే అలా నటిస్తా తప్పితే దాని కోసమే సినిమా చేయనని అంటోంది. '' మధ్యకాలంలో వచ్చిన సినిమా ఆఫర్స్ అన్నీ న్యూడ్ సీన్స్ చేయడం కోసమే. నన్ను సంప్రదించిన దర్శకులంతా నా నగ్నత్వమే కోరుతున్నారు. కథ పడితే కథ తీసుకొచ్చి న్యూడ్గా నటించమంటే నటించేస్తానా ఏంటి? అలా కనిపించేందుకు మాత్రమే నేను ఇండస్ట్రీకి రాలేదు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రాధికా ఆప్టే.

''రక్త చరిత్ర, లెజెండ్, లయన్'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సుపరిచితమైన భామ.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎన్నో బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది. కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉంటూ ఎప్పుడూ జనం నోళ్ళలో నానడం అమ్మడి స్పెషల్ క్వాలిటీ. కాగా ప్రస్తుతం విదేశాల్లోని బీచుల్లో షికార్లు చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది రాధికా. ఇటీవలే ఆమె పోస్ట్ చేసిన బికినీ లుక్స్ తెగ వైరల్ అయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال