మైదా వంటకం.. అబ్బో రుచిలో అమోఘం... మైసూరు బజ్జి, మైదాతో చేసిన పునుగులు, సమోసాలు, బ్రెడ్, బన్, కేక్.. అబ్బో... చెప్పుకూంటూ పోతే మైదా లేని వంటకం, జిహ్వ చాపల్యాన్ని తీర్చగలదా? నోటి రుచి తీరాలంటే మైదా ఉండాల్సిందే... అంతగా వినియోగమవుతున్న మైదా గురించి కళ్లు తిరిగే నిజాలు చాలా మందికి తెలియవు. తెలిస్తే ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే దీనికి దూరంగా ఉండడం ఖాయం..!
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ
Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్. కొన్ని దేశాలలో, ఈ బ్రోమేట్ను కొన్ని రకాల క్యాన్సర్ కి కారకమని భావించి, దానిపై నిషేధం విధించారు. మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే, అవి తక్షణమే మరణిస్తాయి. మైదాపిండి అనేది సహజమైన క్రిమి-సంహారకారిగా ఉంటూ, తినే కీటకాలను వెంటనే చంపుతుంది. ...
మైదాలో ఉండేది బూడిదే...
మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు. మైదా వినియోగం ఆరోగ్యకరం కూడా కాదు. ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఉంటుంది. మైదాను ద మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. ప్రతి ఒక్కరూ పరోటా తినడాన్ని ఇష్టపడతారు. గోధుమలతో చేసిన పరోటా తినడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. కానీ మైదాతో చేసింది తింటే మాత్రం కష్టమే. గోధుమలో ఫైటోకెమికల్స్, ఫైబర్ , బీ, ఈ విటమిన్లు ఉంటాయి. మైదాకు వచ్చే సరికి గోధుమల బయటి భాగాన్ని తొలగిస్తారు. లోపలి ఉండేది స్టార్చ్ మాత్రమే. నిజానికి ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. కానీ మనం కొనే మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా...?
ప్రమాదకరమైన కెమికల్స్ తో బ్లీచింగ్
గోధుమల్లోపలి భాగాన్ని పిండిగా మారిస్తే అది ఎల్లో రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా మార్చేందుకు గాను బ్లీచ్ చేస్తారు. ఇందుకోసం పెరాక్సైడ్ ను వాడతారు. ఈ ద్రావకాన్ని హాస్పిటల్స్ లో గాయాలు క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. బెంజిల్ పెరాక్సైడ్ మొటిమల నివారణకు వాడే క్రీముల్లో ఉండే కెమికల్. దీనితో పాటు, క్లోరిన్ గ్యాస్ ను కూడా మైదా పిండిని తెల్లగా మార్చేందుకు ఉపయోగిస్తుంటారు.
పాశ్చాత్య దేశాల్లో నిషేధం...
ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ను మెజారిటీ యూరోపియన్ దేశాలు, అమెరికా నిషేధించాయి.
ఇక మైదా సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపించేందుకు అల్లోక్సాన్ అనే కెమికల్ ను వాడతారు.
ఇది రక్తంలో ఉన్న షుగర్ పై ఫైట్ చేస్తుంది.
షుగర్ ఎక్కువైతే ఇన్ ఫ్లమేషన్ మార్పులు జరిగి ఆర్థరైటిస్,
గుండె జబ్బులు కూడా వస్తాయి.
అల్లోక్సాన్ కెమికల్ అంత్యంత ప్రమాదకరం.
ఇది పాంక్రియాస్ లోని బీటా కణాలను నిర్వీర్యం చేస్తుంది.
దీంతో డయాబెటిస్ మెల్లిటస్
(మధుమేహం)
బారినపడతారు.
అల్లోక్సాన్ ను కలపడం వల్ల మైదా సాఫ్ట్ గా మారుతుంది.
గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.
శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?
మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటాం
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
*
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి.
అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి.
ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి.
అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
*
సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది.
*
ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి.
దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి.
అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
ఆల్సర్
, గస్త్రిక్ సమస్యలు కలిగిస్తాయి
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
*
మైదాలో
glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
*
రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
*
స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.
దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
*
కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
*
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
*
మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
*
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.
ఇక ప్రొటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి.
*
మైదాలో
glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
*
రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
*
స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.
*
ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు. ఆ ఫుడ్స్ తినాలనిపించదు.
ప్రయోగశాలల్లో జంతువులపై ప్రయోగించేది...
ఇన్సులిన్ పనితీరును పరీక్షించేందుకు వీలుగా వైద్యులు అల్లోక్సాన్ కెమికల్ ను ప్రయోగశాలల్లో ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెడతారు. అవి మధుమేహం బారిన పడిన తర్వాత అప్పుడు మధుమేహ నియంత్రణ మందులను వాటిపై ప్రయోగించి ఫలితాలను చూస్తారు. మైదా ఉత్పత్తిలో ఉపయోగించే బెంజాయిక్ పెరాక్సైడ్ ను వస్త్ర కర్మాగారాల్లో ఉపయోగిస్తుంటారు.
మద్రాస్ హైకోర్టులో పిటిషన్
కే.రాజేంద్రన్ అనే వ్యక్తి మైదాలో విషపూరిత కెమికల్స్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ 2016 మార్చిలో మద్రాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అల్లోక్సాన్, బెంజాయిక్ పెరాక్సైడ్, క్లోరిన్ ఆక్సైడ్ లను వాడుతున్నట్టు పిటిషనర్ ఆరోపణ. క్లోరిన్, బెంజాయిక్ పెరాక్సైడ్ లను అమెరికాలో నిషేధించారని, మైదాను బ్లీచ్ చేయడం వల్ల పోషక విలువలు, ఫైబర్ నశించిపోతాయని.... తెల్లగా మార్చడం అన్నది చాలా ప్రమాదకరమని, బ్లీచ్ డ్ మైదాను స్లో పాయిజన్ అని డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని రాజేంద్రన్ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. అల్లోక్సాన్ అనేది ఔషధ ప్రయోగ శాలల్లో ఎలుకల్లో మధుమేహం తీసుకొచ్చేందుకు ఉపయోగించే రసాయనంగా కోర్టుకు వివరించారు. దీంతో ఈ విషయమై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
గోధుమలో ఏముంటాయి?
గోధుమ గింజలో పైన ఉండేది పొట్టు భాగం. దీన్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. తర్వాతి పొర జెర్మ్ భాగంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా గింజలో ఎక్కువ భాగం ఉండేది ఎండోస్పెర్మ్. దీన్నే మైదాగా పేర్కొంటారు. ఇందులో ఎటువంటి పోషకాలు ఉండవు. కార్బొహైడ్రేట్లు, షుగర్ ఎక్కువగా ఉంటాయి. మిల్లులో గోధుమలను పిండిగా కొట్టిన తర్వాత దాన్ని జల్లెడ పడతారు. ఈ జల్లెడలోనే మైదాను వేరు చేసే అతి సన్నని రంధ్రాలతో కూడిన వాటిని ఉపయోగిస్తారు. దీంతో ఫైబర్ సమృద్ధిగా ఉండే గోధుమ పై భాగం అంతా జల్లెడలోనే ఆగిపోయి ఎండోస్పెర్మ్ భాగం మాత్రం కిందకు దిగుతుంది. ఇందులో మూడొంతులు పోషకాలు తగ్గిపోయినట్టే అనుకోవాలి. ఇక దీన్ని మరింత తెల్లగా మార్చేందుకు కెమికల్స్ తో బ్లీచ్ చేస్తే అవి కూడా నశించిపోతాయి. దాంతో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.
వీటితో చాలా డేంజర్
పెట్రోలియం నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అనే ఉత్పత్తులు తయారవుతాయన్న విషయం తెలుసు. పెట్రోలియం నుంచి ఈ ఉత్పత్తులను వేరు చేసిన అనంతరం మిగిలే మినరల్ ఆయిల్ కు పెద్దగా వాసన ఉండదు. దీన్ని ఏదైనా ఆహార పదార్థం తయారీలో వాడినా దీర్ఘకాలం పాటు పాడవకుండా ఉంటుంది. అదే కొబ్బరి నూనెతో చేసి చూడండి. రెండు మూడు రోజుల తర్వాత అది వాసన వస్తుంది. సహజంగా ఏ ఆహార పదార్థంలోనయినా బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కానీ, మినరల్ ఆయిల్ లో చేసిన ఆహార పదార్థంలో బ్యాక్టీరియా మనలేదు. దీన్ని బట్టి ఇది ఎంత పవర్ పుల్ అనేది తెలుసుకోవచ్చు.
మన దేశంలో చాలా రకాల ఆహార పదార్థాలు అజినోమోటోతో తయారవుతున్నాయి. ఇది రుచిని పెంచుతుంది. ముఖ్యంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్, సూప్, మైదాతో తయారయ్యే ఉత్పత్తుల్లో అజినోమోటోను ఉపయోగిస్తున్నారు. చైనీస్ ఆహార పదార్థాల్లో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంది. అజినోమోటో ఉన్న ఆహారపదార్థాన్ని తిన్న తర్వాత తలనొప్పి వస్తే అది కచ్చితంగా ఆ రసాయన ప్రభావమని తెలుసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం.
బేకరీ ఉత్పత్తులతోనూ ముప్పే...
ఇక బేకరీ ఉత్పత్తుల్లో వాడే సోడియం మెటా బై సల్ఫేట్, బెంజాయిక్, సిట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనుషులకు తీవ్ర హాని కలిగించే రసాయనాలే. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులకు వీటితో మరింత ముప్పు. నిజానికి 90 శాతం బేకరీ ప్రొడక్ట్స్ కు మైదానే ముడి సరుకు. బేకరీ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ ను వాడుతుంటారు. అసలు అవి ఏమిటో, వాటితో వచ్చే హాని ఏమిటో చాలా మందికి తెలియని విషయం. కేక్ ఎంతో మధురం, పిజ్జా, బర్గర్, బన్ మంచి రుచి ఉన్నాయి కదా అని బేకరీ ప్రొడక్ట్స్ ను లాగించడం కాదు... అందులో మైదా, మినరల్ ఆయిల్, అజినోమోటో, ప్రిజర్వేటివ్స్, డాల్డా, శాక్రిన్, షుగర్ వంటి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచేవి ఉంటాయన్న స్పృహతో ఉండాలి. సాధ్యమైనంత వరకూ బేకరీ ప్రొడక్ట్స్, చైనీస్ ప్రొడక్ట్స్, మైదా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఎన్నో ఆరోగ్య సమస్యలు
ముఖ్యంగా తరచూ మైదాతో తయారయ్యే వాటిని తినడం వల్ల కచ్చితంగా వారు ఊబకాయం, మధుమేహం, మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమ పిండిలో గ్లైడిన్ ఉంటుంది.
ఇది ఆకలిని పెంచుతుంది.
తద్వారా అధిక కేలరీలు చేరతాయి.
మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి రక్తంలో కొలెస్ట్రాల్,
ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి.
బరువు పెరుగుతారు.
మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల చైతన్యం తగ్గిపోతుంది.
ఫలితంగా మలబద్ధకం బారిన పడతారు.
దీనివల్ల పైల్స్,
ఫిషర్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఫైబర్ లేకపోవడం వల్ల కోలన్ కేన్సర్ కూడా రావచ్చు.
ఫైబర్,
ప్రొటీన్ లేకపోవడం వల్ల గ్యాస్టిక్,
అల్సర్,
గాల్ బ్లాడర్ సమస్యల బారిన పడతారు.
అధిక జీఐతో కూడిన వాటిని తిన్న తర్వాత రక్తంలో వెంటనే గ్లూకోజ్ కలిసిపోతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం మైదా ఉత్పత్తుల వినియోగం కొనసాగితే ఇన్సులిన్ ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతుంది. దీంతో టైప్2 డయాబెటిస్ బారిన పడతారు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఓ ఆహార ఉత్పాదన బ్లడ్ గ్లూకోజ్ పై చూపించే ప్రభావం. దీన్నే జీఐ వేల్యూగా చూపిస్తారు. అధిక జీఐ ఉంటే ఆహారంలోని గ్లూకోజ్ సత్వరమే రక్తంలో కలిసిపోతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. శరీరానికి కావాల్సింది పోను మిగిలినది అంతా కొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. కనుక జీఐ అధికంగా ఉండే రిఫైన్డ్ మైదా ఫ్లోర్ వాడకం వల్ల శరీరంలో కొవ్వు బాగా పెరిగి గుండె జబ్బుల బారిన పడతారు.
అదే జీఐ తక్కువగా ఉన్న వాటిని తీసుకుంటే నిదానంగా గ్లూకోజ్ రక్తంలోకి విడుదల అవుతుంది. పండ్లు, కూరగాయలు, నట్స్, బీన్స్ లో జీఐ తక్కువ ఉంటుంది. ముడి గోధుమ, దంపుడు బియ్యంలో మధ్యస్తంగా జీఐ ఉంటుంది. మైదా, వైట్ రైస్ లో జీఐ అధికంగా ఉంటుంది.
(హార్ట్ రీడర్ గ్రూపు వారు పంపిన పోస్టు)
Tags
Health & Fitness