kelvinjay ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

పూజా బాత్రా లేటెస్ట్ హాట్ ఫోటో స్టిల్స్


నిహారిక లేటెస్ట్ ఫోటో స్టిల్స్


కంగనా శర్మ హాట్ ఫోటో గేలరీ


నందిని రాయ్ ఫోటో గేలరీ


రైమ సేన్ హాట్ ఫోటో స్టిల్స్


విటమిన్ డి లోపంను అధికమించడం ఎలా ..!

ఈ కాలంలో ప్రజలు చాలామంది అనారోగ్యంపాలైన తర్వాత ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ అనారోగ్యంపాలు కాకముంది పాటించాల్సినవి నియమాలు మాత్రం పాటించడం లేదు. ఎందుకు అంటే ఈ హైటెక్ కాలంలో సమయం ఉండటం లేదు. అంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాం  ప్రజలు. ఇంకా చాలామంది అయితే ఉదయం 9 తర్వాత దాటాకె ఇంటి బయటకు వస్తారు.. సరిగ్గా అర్ధగంటలో స్కూటర్లో ,కార్, బస్సులోగాని  ప్రయాణించి మళ్ళి నీడా పాటున ఉంటున్నారు.

అసలు మనం ఎండ తగలకుండానే రోజు గడిపేస్తున్నారు. దీనివల్ల ఎండా ద్వారా శరీరానికి అందవలసిన విలువైన విటమిన్ డి ని కోల్పోతున్నారు. ఇలా ఏళ్ళు గడిచే కొద్దీ మన శరీరంకు కావలసిన విటమిన్ డి లోపించి పలు అనారోగ్యాల పాలవుతారు. శాఖాహారుల్లో ఈ విటమిన్ డి లోపం ఇంకా చాల ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్, క్లోమం క్యాన్సర్ల ముప్పు చాల ఎక్కువని పలు పరిశోధనలో రుజువైంది.

మన భారత దేశంలో 90 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిఒక్కరికి విటమిన్ డి అందలి. విటమిన్ డి లోపిస్తే శరీరంలో వచ్చే లోపాలను, మార్పులను, లక్షణాలను గురించి చదివి తెలుసుకోండి.  

విటమిన్ డి శరీరానికి తగినంత అందితేనే కాల్షియాన్నివస్తుంది . విటమిన్ డి లోపం తలెత్తితే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడి ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. అధిక బరువున్నఉబకాయల్లో ఈ మార్పు మరింత వేగంగా కనిపిస్తుంది.

విటమిన్ లోపం ఉన్నవారిలో కండరాలూ, కీళ్ల నొప్పులూ చాల దీర్ఘకాలం బాధిస్తాయి.

కొందరు ఎన్నిఆహార నియమాలు పాటించినా, ఎక్కువ విశ్రాంతి తీసుకున్నా అలసటా, ఒత్తిడీ బాధిస్తూనే ఉంటాయి . అలాగే క్షణక్షణానికీ మనఃస్థితి, భావోద్వేగాలు మారిపోతాయి. తరచూ ఈ సమస్య కనిపిస్తుంటే అది విటమిన్ డి లోపం మనలో ఉందని గమనించాలి .

వాతావరణం చల్లగా  పొడిగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, దురదగా, చిరాగ్గా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఉన్నట్టు గమనించాలి .

విటమిన్ డి నివారణకొరకు 

ప్రతి రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో కనీసం అరగంట మన శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి.

రోజూ పాలూ, దానిమ్మ, నారింజ, చేపలూ, బాదం పప్పు, ఆకుకూరలూ.. అధిక మోతాదులో మన ఆహారంలో తీసుకుంటే ఈ లోపం పూర్తిగా నయమవుతుంది.

చలికాలంలో వచ్చే చుండ్రుకు అద్భుతమైన మన ఇంటి చిట్కాలు ...

చుండ్రు ఎన్ని విధాలుగా తరిమెయ్యాలని చుసిన ఎన్ని ప్రయోగాలు సరే అసలు పోదు. ఇంకా చలికాలంలో అయితే పరిస్థితి మరి దారుణం. ఎన్ని సార్లు మార్కెట్లో దొరికే షాంపూలతో తల స్నానం చేసిన అస్సలు వదలదు ఈ దారుణమైన చుండ్రు.. అయితే ఇలాంటి మొండి చుండ్రుకు మాములుగా చెప్తే సారిపోదు మరియు  ఇతర రసాయన మందులు వాడిన సరే అసలు పోదు. అయితే ఈ చుండ్రును సమూలంగా వదిలిoచుకోవాలంటే  సహజసిద్ధమైన మన ఇంటి చిట్కాలు పాటించి మొండి చుండ్రుకు ఈ చలికాలంలో గుడ్ బై చెప్పవచ్చు . ఈ చిట్కాలు ఏంటో చూడండి  .

బాగా పులిసిన పెరుగు, గోరింటాకు, గుడ్డులోని తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు బాగా పట్టించి ఒక గంట ఆరిన తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది. 

వేపాకు వేసి కాచిన వేడి నీటితో తలస్నానం చేసిన మొండి చుండ్రు అవుతుంది.

తలలో పేల సమస్య ఉన్నవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తుడుచుకొని సాంబ్రాణి పొగ వేస్తే పేల సమస్య వదిలిపోతుంది.

నిర్జీవంగా ఉన్న వెంట్రుకలు రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపిన కొబ్బరి నూనె రోజు రాస్తుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

నల్లని జుట్టు కావాలనుకునే వారు నిమ్మరసం, తులసి రసం , కరివేపాకు కలిపి నూరి తలకు బాగా పట్టిస్తే మంచి గుణం కనిపిస్తుంది.