Surpanakha Yokka Punar Janma Visheshalu(శూర్పణఖ యొక్క పునర్జన్మ విశేషాలు ఏమిటి చూద్దాం )



మనపురాణాల్లో ఎన్నో పునర్జన్మ విశేషాలున్నాయి. త్రేతాయుగంలో రాముడే ద్వాపరయుగంలో కృష్ణునిగా అవతరించడం జరిగింది. ఇది చక్రభ్రమణం. అందరూ యుగాలతో పాటు జన్మలెత్తుతూనే ఉంటారు. రాముని కాలంలోని వానరులు, కృష్ణుని కాలంలో గోపగోపికలు, కలియుగంలో మానవులుగా జన్మించారంటారు. స్వభావాన్ని బట్టి మంచివారు, చెడ్డవారు అనుకోవాలి. అంతేఎలాగంటే? శూర్పణఖ కుబ్జగా పుట్టింది. రాముని వరించి, లక్ష్మణునితో, ముక్కు చెవులు కోయించుకుంది. సీతాదేవి అందచందాలు వర్ణించి, రావణునితో సీతాపహరణం చేయించి, రామరావణ యుద్ధానికి కారకురాలయ్యింది. తరువాత ఆమె ప్రసక్తి రామాయణంలో ఎక్కడా కన్పించదు. కానీ ఆమె, రావణునికి పినతల్లి కూతురు, భర్త చనిపోతే సోదరులయిన ఖర,దూషణల దగ్గర దండకారణ్యంలో ఉండేది. సమయంలోనే రాముడు, సీతా, లక్ష్మణులతో కలిసి వనవాసానికి వచ్చి దండకారణ్యంలో పంచవటి దగ్గర పర్ణశాల నిర్మించుకొని ఉంటున్నారు.

 ➡లక్ష్మణుడు పండుకోయటానికి అడవిలో తిరుగుతూ దేవతలను చంపే శక్తికోసం తపస్సు చేస్తున్న శూర్పణఖ కొడుకు తలపొరపాటున ఖండిస్తాడు. భర్తను కోల్పోయిన శూర్పణఖ కొడుకు కూడా చనిపోయాడని తెలిసి చాలా దుఃఖించి, తన కొడుకును చంపిన వానిని చంపాలని, పర్ణశాలకి వస్తుంది. అక్కడ రాముని అందానికి బానిసై తనని పెళ్లి చేసుకోమని రాముని కోరుతుంది. నేను ఏకపత్నీ వ్రతుడను. అదిగో అక్కడ ఉన్న నా తమ్ముని వరించు, అని లక్ష్మణుని చూపించాడు రాముడు. లక్ష్మణుని దగ్గరకు వెళ్లిన శూర్పణఖకు అవమానమే ఎదురయ్యింది. ముక్కు చెవ్ఞలు కోయించుకున్న శూర్పణఖ రావణునికి సీత అందచందాలు చెప్పి రెచ్చగొట్టి సీతాపహరణం చేయించింది. ఆమె శ్రీరాముని అందచందాలకు మోహితురాలై శివుని గురించి పుష్కర తీర్థములో నీటిలో నిలబడి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సుకు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. రాముడినే నాకు భర్తగా ప్రసాదించమని కోరుకుంది.

 ➡అది జన్మలో తీరేది కాదని, మరుజన్మలో తప్పక తీరుతుందని రాముడే కృష్ణునిగా అవతరించి నీ కోరిక తీరుస్తాడని వరమిచ్చాడు శివుడు. మరుజన్మలో గూనితో వంకర్లతో కుబ్జగా పుట్టి, కంసుని దాసిగా చందన లేపనాలు అత్తర్లు, పూలు రోజూ కంసుని మందిరానికి తీసుకువెడుతూ ఉండేది. అష్టవంకర్లున్నా ముఖం మాత్రం కాంతితో అందంగా ఉండేదట. కానీ గూని వలన సిగ్గుతో ఎప్పుడూ తలదించుకొని ఉండేదట. కంసుడు కృష్ణుని వధించాలనే ఉద్దేశ్యంతో ధనుర్యాగము చేస్తున్నట్లు చెప్పి, బలరామకృష్ణులను తీసుకురమ్మని అక్రూరుని పంపుతాడు. అక్రూరునితో మధురకు వచ్చిన బలరామకృష్ణులు చందన లేపనాలతో తలవంచుకుని వెళుతున్న కుబ్జను చూసి అదేమిటని పలకరిస్తారు. తననుచూసి ఎగతాళి చేసే వాళ్ళు వెటకారంగా నవ్వేవాళ్లే కానీ, ఆప్యాయంగా పలుకరించే వాళ్ళు లేరు కదా అని వంచిన తల ఎత్తివారిని చూస్తుంది.

 ➡అందచందాలతో వెలిగిపోతున్న వాళ్లను చూడగానే ముగ్ధురాలై, కంసునికి తీసుకువెడుతున్న చందన లేపనాలు వాళ్లకి పూస్తుంది. మెడలో పూలదండలు వేసింది. ఆమె చేసిన పనికి కృష్ణుడు సంతోషంతో తన పాదముతో ఆమె కాలు అదిమి గడ్డము పట్టుకొని ఆమెను పైకి లేపుతాడు. మూడు వంకర్ల గూనితో ఉన్న కుబ్జ మంచి సుందరాంగిగా మారిపోతుంది అది చూసిన వాళ్లందరూ కృష్ణుని మాయకు ఆశ్చర్యపోతారు. ఆమె కృష్ణుని పాదాలపై బడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలుతుంది. కాని కృష్ణుడు తను వచ్చిన పని పూర్తిచేసుకోవాలని తరువాత వస్తానని చెప్పి కంస మందిరానికి వెళ్లిపోతాడు.

అప్పుడు కృష్ణుని వయస్సు పన్నెండు సంవత్సరాలే. తరువాత కంస వధ జరిపి, తల్లిదండ్రుల చెర విడి పించి, సాందీపుని దగ్గర విద్యాభ్యాసము ముగించుకుని నవయవ్వనుడై ఒకసారి కుబ్జ ఇంటికి వెళతాడు. కుబ్జ సుందరి కృష్ణుని కొరకే ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. శివుని వరం నిజం చేయాలి కనుక కృష్ణుడు కుబ్జ దగ్గర కొన్నిరోజులు ఉండి శూర్పణఖ కోరికను తీరుస్తాడు. వారికి ఉపశ్లోకుడనే పుత్రుడు పుడతాడు. అతడు నారదునికి శిష్యుడవుతాడు. ఇదంతా కృష్ణుడు, రుక్మిణీదేవిని పెండ్లి చేసుకోకముందే జరిగింది. ఆవిధంగా రాముని మోహించిన మునిజనాలు, కృష్ణుని కాలంలో పదహారు వేల భామలయి ఆయన సాన్నిధ్యాన్ని పొందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال