Aswadhama tho Pilot Baba Anubhavalu (అశ్వత్థామతో పైలట్ బాబా అనుభవాలు)



 ఉన్నత హిమ శిఖరాలలో ఈనాటికీ, వేలాది సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న మహాత్ములున్నారు. నా సంచారంలో ఇలాంటి వారిని  , చాలా మందిని కలిసాను. వారితో కొంత కాలం ఉండి, వారి జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందాను.....అలా "అశ్వత్థామ దర్శనం" ....అందులో భాగమే.

    ఒక సారి నేను "పహాడీ బాబాతో" కలసి, నర్మదా తీరంలో నడుస్తున్నాను. మేమిద్దరం అలా, వెళ్ళి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించాం. అడవిలో "భిల్లులనే" ఆటవిక జాతి నివాసముంటోంది. దారి దోపిడీలు చేయడం వారికి కూసు విద్య. అడవి గుండా వెళ్ళే యాత్రికులను దోచుకోవడం, వారికి ఆనవాయితీ.

      బంజారా జాతి వారిని మాత్రం వారు బాధించరు. మేము, కేవలం లంగోటాలు మాత్రమే ధరించి, అడవి గుండా పోతుంటే.... ఆటవికులు, మమ్మల్ని చూసి వింత ధ్వనులు చేయసాగారు. కొద్ది సేపటి తరువాత, భిల్లులు మమ్ములను చుట్టు ముట్టారు. మా వద్ద ఉన్న మూటల్లో....వేపాకులు, విభూతి తప్ప, మరేమీ లేవు. భిల్లులు మూటలను లాక్కుని తెరచి చూసి నిర్ఘాంతపోయారు. వారిలో వారు ఏవో సైగలు చేసుకొని, మమ్మల్ని వెంట రమ్మన్నారు. కొంచెం సేపట్లో, మమ్మల్ని వారి ప్రధాన గుడిసె లోకి తీసుకొని వెళ్ళి, చాపల మీద కూర్చోమని చెప్పి, అగ్నిహోత్రం వెలిగించారు. రొట్టెలు చేసి తేనెతో వడ్డించారు. గడ్డితో చేసిన రొట్టెలు, తేనెతో మేమునూ తిని, వారికి కొన్ని పెట్టాం. మాకోసం వారు ఒక ప్రత్యేక కుటీరాన్ని కేటాయించారు. పండ్లు, దుంపలు కూడా సేకరించి మాకిచ్చారు. అలా వారు మమ్మల్ని భక్తితో సేవించారు.

 ఆ ఆటవికులకు, తమదైన క్రమ శిక్షణ కలదు. జాతి నాయకుడి మాట వారికి శిరోధార్యం. అతనికి ఎప్పుడూ ఎదురుతిరగరు.  శివుడు వారి కుల దేవత. ప్రొద్దున్న, సాయంత్రం...మా వద్దకు వచ్చి కూర్చొనే వారు.

 

    ఒక్కోసారి రాత్రంతా, సంగీత-నాట్యాలతో గడిపే వారు. వారిలో కొందరు దొంగిలించిన దుస్తులు వేసుకొనేవారు. కొంత మంది చెట్ల పట్టాలు ధరించేవారు. భిల్లులనే ఆటవికులతో, ఒక మనిషి వస్తూండే వాడు, మేమున్న కుటీరానికి. వచ్చే మనిషి ప్రత్యేకించి కాషాయ దుస్తులు ధరించి, వారి కంటే భిన్నంగా, హుందాగా ఉండేవాడు. అతనితో మేము మాట కలపడానికి ప్రయత్నించినపుడల్లా, మాటలాడకుండా వెళిపోయేవాడు.

      ఒకనాడు, మేము ప్రాంతంలోని మహాదేవుని మందిరంలో విశ్రాంతి తీసుకొనుచుండగా,  అసాధారణ వ్యక్తితో మనస్సు,చూపు కలిసాయి. అతను ఆజానుబాహుడు. యువకుడులా ఉన్నాడు. అతనికి చక్కని మీసకట్టు ఉన్నది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. శాంతం,సౌమ్యం, ధీర-గంభీర వ్యక్తిత్వం అతని స్వంతం. అతను నొసటికి పసుపు రంగు గుడ్డను కట్టుకొని ఉన్నాడు. నేను పహాడీ బాబాతో అతని గురించి, అతని ఆహార్యాన్ని గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి మాటలాడుతుంటే, అతను మా వైపు అర్థవంతంగా చూసి, చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళిపోయాడు.

    కుతూహలం ఆపుకోలేక మేము అతనిని వెంబడించాను. అతను, నన్ను వెంబడించవద్దని వేడుకొన్నాడు. అయిననూ మేము మా పట్టుదల విడిచి పెట్టకుండా, అతనికి పాద నమస్కారం చేసి ఇలా ప్రార్థించాను. " మీరెవరైనా కానీ, మీ పూర్తి పరిచయ భాగ్యం మాకు కావాలి, మీ మార్గదర్శకత్వం మాకు కావాలి, మీ ఉన్నత-గహన-గంభీర రూపం చూస్తుంటే, మీరు ఈనాటి పురుషులు కాదనిపిస్తోంది. దయచేసి మీ పరిచయ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి.

    నేనిలా ప్రవర్తించడం, ఆటవికులకు నచ్చలేదు. రహస్య వ్యక్తి వాళ్ళకు అత్యంత పూజనీయుడు. మహా శివరాత్రి నాడు శివునితో పాటు, విచిత్ర వ్యక్తిని కూడా పూజిస్తారు.

     మహావ్యక్తి భిల్లులను శాంతించమని చెప్పి, నన్ను ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు. "కపిల్ ! నేను ద్రోణాచార్యుని పుత్రుడైన "అశ్వత్థామను". మహాభారత కాలంలో సేనాపతిని. అయితే, అదంతా గతం.  అయినా నన్ను గత జ్ఞాపకాలు విడవడం లేదు. భిల్లుల నివాస ప్రాంతంలోని, దేవాలయమే నా నివాసం. భిల్లులు నా సహచరులు. నేను ఎప్పుడో ఒకసారి, హిమాలయాలకు వెళ్ళి కృపాచార్యుడిని, విధురుడిని కలుస్తూంటాను. ఎక్కువ భాగం ఇక్కడే ఆదిమ వాసుల జీవితంలో పాలు పంచుకుంటాను. కపిల్, మాకైతే కాలం నిలిచిపోయింది. కృపాచార్యుల వారు, విధురుల వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూంటారు. అప్పుడిది ఒక హిమాలయమే అవుతుంది.

   ... గోరఖ్ నాథ్ జీ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారు. ఆయన దర్శనం , ఆశీర్వాదంతో సమానం. ఆయనతో కలసినపుడు, ప్రాచీన బ్రహ్మాండాన్ని తలచుకొని, జీవులెలా జనన-మరణ చక్రంలో తిరుగుతుండేది, గమనిస్తాం. మాకు భూత, భవిష్య, వర్తమానాలు తెలుసు. అయినా ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఇదివరకటిలా ఇప్పుడు లేము.

       అశ్వత్థామ, తన తలకట్టు తీసివేయగా...వంకులు తిరిగిన ఆయన జుట్టు, ఆయన నొసటి పైకి జారింది. ఆయన విశాల ఫాల భాగం మధ్యలో , లోతైన గాయపు గుర్తు ఉన్నది. గాయపు రంధ్రంలోంచి వింత కాంతి వస్తోంది. "నా నొసటి పై గల మణి, పోవడం వలనే...నా యుద్ధపు టెత్తుగడలు, దైవీ శక్తి అంతమొందాయి. అన్ని శక్తులు నన్ను వదలివేశాయి. అందుచే, ప్రతిఫలంగా...."చిరంజీవత్వం" అనే వరం లభించింది. ఆనాటి నుండి కూడా నేను భూమి

 ీద జీవిస్తున్నాను. నా సమకాలికులు జంతువులుగా, పక్షులుగా, పాములుగా....జన్మ ఎత్తడం చూసి, మానవుని నిస్సహాయతను గుర్తించి బాధ పడుతున్నాను. నేనైతే జనన-మరణ చక్రంలో బంధితుడిని కావడం ఇష్టం లేదు. నేను పూర్తిగా శివారాధనలో మునిగిపోయాను.

      ఇలా అశ్వత్థామ సాహచర్యంలో, ఆరు మాసాలు గడిపాము. వేల సంవత్సరాల వయస్సున్న మనిషి, ప్రస్తుతం తానున్న సమాజ విధానాల వలన ప్రభావితుడు కాకుండా ఉండగలడో, ఎలా జీవించగలడో అర్థం చేసుకున్నాను........

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال