Potta Tagge Mana Vantinti Chitkalau(పొట్ట తగ్గే మన వంటింటి చిట్కాలు)



1.కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, అనప,పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.

 2.పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.

 3.అరటీస్పూన్ మెంతి పొడినీళ్లలో కలిపి రాత్రిపూట మూలం, వందగ్రాముల వరిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవడం రకరకాల పిండి పదార్థాలతో బయట చేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం తినాలి.

 4.భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం 30ని ఒక్కసారి నీళ్ళు త్రాగండి.

 5.రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి.

 6.కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.

 7.సహజంగా లభించే గ్రీన్టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి

 8.బార్లీ గింజలు: అధిక బరువును అరికట్లే ఆహార పదార్థం బార్లీ. బార్లీ గింజలను గంజి చేసుకొనే తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال