Pancha Bhuthallo Agni Devuni Gurinchi(పంచభూతాల్లో అగ్నిదేవుని గురించి)



డబ్బు, ఆరోగ్యం, సుఖాలు, హోదాలు ఇలా ఏదైనా అనుగ్రహించగల అగ్ని ఆరాధన గురించి తెలుసుకోండి

 అగ్ని ఆరాధన అనేది మన సనాతన భారతీయ సంప్రదాయానికి మూల స్తంభం మరియు సనాతన ధర్మ ఔన్నత్యానికి ప్రతీక మన జీవన విధానానికి , పురోభివృద్ధికి చిహ్నం.

 మన చుట్టూ చాలా మంది డబ్బున్నవాళ్ళు, రాజకీయనాయకులు , సెలెబ్రిటీలు ఇలా ఎందరో ఎక్కువగా అగ్ని ఆరాధన చేస్తారు లేదా వారి పేరు మీద చేయించుకుంటారు అని తెలుసా.ఎందుకంటే నీకు ఏమి ఇవ్వాలన్న అగ్ని దేవుడే ఇవ్వాలి ఎందుకంటే నువ్వు భగవంతుడికి ఏది సమర్పించిన ఆయనే చేరవేస్తాడు ( హవ్య వాహనుడు)...మనకి పరమాత్మకి మధ్య వారధిలా కూడా పని చేస్తాడు.. నీలో జఠరాగ్ని రూపంలో ఉండి నువ్వు తిన్నది పచనం చేస్తున్నాడు.మన శరీరంలో ఉష్ణo రూపంలో ఉండవలసిన రీతిలో ఉంటూ మన శరీరం పడిపోకుండా కాపాడుతున్నాడు ఇలా ప్రతి చోటా ఉండి మనల్ని రక్షించే పరమాత్మ స్వరూపుడు..

పూర్వము చాలా వరకు అందరి ఇళ్ళలో కూడా పొయ్య మీద అన్నం వండిన తరువాత అందులోనుండి కొద్దిగా మెతుకులు తీసి మంటలో వేసి కొద్దిగా నెయ్యి వేసేవారు అంటే అది కూడా ఒక రకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పటమే అలాగే మనలో ఉన్న జఠరాగ్ని లో చెత్త పడితే చెత్త వేసి పాడుచేస్తే తరువాత తిన్నది అరగదు, తినటానికి ఆకలి వెయ్యదు కనుక మిత మైన, శుచి శుభ్రత కలిగిన ఆహారాన్ని తీసుకోండి అదికూడా దేవునికి అర్పించి తినండి..మనం ఒక ముద్ద తినగలుగుతున్నాం అంటే దేవుని దయ ఉండాలి ఎంతో మంది వజ్రాలు , రత్నాలు పొదిగిన కంచంలో తినగలిగిన వాళ్ళు కూడా ఒక్క ముద్ద తినలేని రోగాలతో బాధ పడుతున్నారు కనుక మీరు తినే ఆహారాన్ని ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో తినండి..

పాచి మొహంతో, స్నానం లేకుండా పొయ్యి వెలిగించి వంట చేయరాదు ఎంత డబ్బున్నవాళ్ళు అయినా క్రమంగా దరిద్రులు అయిపోతారు, అగ్నిని నోటితో ఊది ఆర్పరాదు, కాలితో తొక్కి ఆర్పరాదు, హేళన చెయ్యటం లాంటి దోషాలు ఎప్పుడూ చెయ్యకండి..

 మీరు కూడా అగ్ని ఆరాధన చెయ్యటం మొదలు పెట్టండి మీ సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఆయన ధార్మికమైన కోరిక అయినా ఇవ్వలేనిది అంటూ ఏమి లేదు..ఇప్పుడు మనలో అందరికి రకరకాల ప్రశ్నలు వచ్చేస్తు ఉంటాయి..ప్రతి రోజు చెయ్యమంటున్నారు ఇంట్లో చేయవచ్చా, దిక్కున చెయ్యాలి, ఆవు నెయ్యి వాడాలా, అగ్నికి ఆహ్వానం పలికితే మళ్ళీ ఉద్వాసన చెప్పాలి అంటారు మరి మంత్రాలు మాకు రావు కదా....ఇలా చాలా రకాలుగా..

ముందు ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమనగా మనం పెద్ద పెద్ద సోమ యాగాలు, చండి హోమాలు చేయట్లేదు చాలా సులభంగా దీపారాధన ఎలా చేస్తాము అలా అంతే. నాకు ఇప్పటికి కూడా ప్రతి రోజు క్రమం తప్పకుండా నిత్యాగ్నిహోత్రం చేసే మహానుభావులు, కారణజన్ములు తెలుసు వారు అంతా హంగు ఆర్భాటాలకి దూరంగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే..

అలానే మీకు దగ్గరలోని వేదం చదువుకున్న గురువులను ఆశ్రయించండి వారిని అడగండి కావాలంటే వారు నేర్పుతారు ( కేవలం చిన్న గిన్నె ( హోమ గుండంలా, ఎండు కొబ్బరి, హారతి కర్పూరం, ఆవు నేయి మాత్రం చాలు మీరు అగ్ని ఆరాధన చెయ్యటానికి)..

కాకపోతే స్వాహాకారం కలుపుతాము దేవునికి చేస్తే దేవునికి, అలా అని ఉగ్రదేవతా ఆరాధన చెయ్యరాదు..

మీకు దగ్గరలోని అగ్నిహోత్రం చేసేవాళ్ళని వినయ,విధేయతలతో ప్రార్దించి చూడండి తప్పక నేర్పుతారు లేదా నాకు వీలు కుదిరినప్పుడు ఒక వీడియో చేసి పెడతాను లేదా దానికి సంబంధించిన కార్యక్రమం ఎలా చేసుకోవాలి అనే లింక్ ఎవరైనా పెద్దలది పోస్ట్ చేస్తాను..

వీలు కుదిరిన వాళ్ళు ప్రతిరోజు 108 సార్లు స్వాహా కార మంత్రంతో చేసుకోండి లేదా వారానికి ఒక్కసారి అయినా వీలు చూసుకుని చేసుకోండి...మీరు ఊహించని విధంగా మీ జీవితంలో మార్పులు జరిగి మీ కుటుంబం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. మీరు ఇప్పటికి కూడా ప్రతిరోజు అగ్ని ఆరాధన చేసే వారి యొక్క మొఖంలో తేజస్సుని చూడండి అగ్నిలా వెలుగుతూ ఉంటారు..

 ఎంతో గొప్పదైన మన సనాతన సంప్రదాయ విజ్ఞానంలో ఇటు వంటి విషయాలను వదిలిపెట్టి మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నాం..వీలైనంత తొందరగా ప్రారంభించండి..మీరు మనసా నిజంగా చేద్దాం అనుకుంటేనే ఆయన అనుగ్రహం మొదలు అయిపోతుంది (ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః కదా )

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال