Benefits of Wearing Toes Rings by Womens in India(స్త్రీలకు లాభాలు చేకూర్చే మెట్టెలు)



 
 హిందూ సంప్రదాయాన్ని అనుసరించి పెళ్ళయిన స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో ''మెట్టెలు''గా ఉన్న పదం నిజానికి ''మట్టెలు''.

 మనలో చాలామందికి అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం కలగడం సహజం.
ఆధునిక యువతులు ''మెట్టెలు ఎందుకు ధరించాలి.. చూడగానే పెళ్ళి అయింది అని తెలియడానికే తప్ప అవి కాలివేళ్ళకు పెట్టుకోవడం వల్ల మరేమీ ప్రయోజనం లేదు కదా?!” అని ప్రశ్నిస్తున్నారు.

  నేపథ్యంలో వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించడం వెనుక ఏమైనా ప్రయోజనం ఉందో లేదో తెలుసుకుందాం.

 సంప్రదాయ పెళ్ళిళ్ళలో ''స్థాలీపాకం'' పేరుతో ఒక ఆచారాన్ని పాటిస్తారు.
సమయంలో పెళ్ళికూతురి కాలివేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. ఆచారం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...

 మెట్టెలు ధరించడం శుభసూచకం, మంగళకరం.

 గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.

 సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా వత్తిడి కలిగించడంవల్ల సమస్యలు నివారణ అవుతాయి.

 పురుషుల కంటే స్త్రీలలో కామం ఎక్కువట. విషయాన్ని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. పూర్వకాలంలోనే వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే కొంత కామం తగ్గుతుందని, పురుషునితో సమానంగా ఉంటుందని, అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావని మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారు.

 మెట్టెల సాయంతో కాలివేళ్ళకు వత్తిడి తగిలించడంవల్ల కామ సంబంధమైన కోరికలు తగ్గుతాయి. సన్యాసులు పావుకోళ్లు ధరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే.

 మెట్టెలు పెట్టుకోవడంవల్ల కొన్నిరకాల చర్మవ్యాధులు రావు.

 చిన్నపిల్లలకు రాగి కడియాలు తొడగడం మనకు తెలిసిందే. అవి కలిగించే వత్తిడివల్ల అనేక అనారోగ్యాలు నయమౌతాయి.

 మెట్టెలు పెట్టుకోవడంవల్ల పాదానికి ఒక వింత శోభ వస్తుంది.

 మెట్టెలు వెండితో తయారైనవి. వెండి శరీరంమీద ఉంటే మంచిది.

 మెట్టెలు ధరించడంవల్ల ''ఈమెకు వివాహం అయింది'' అనే సంకేతం కనిపిస్తుంది కనుక పరపురుషుల వ్యామోహం నుండి మెట్టెలు ఒక రకంగా రక్షిస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال