What is Achamanam and Rituvals



పూజలు, వ్రతాల్లోఆచమనంఅనే మాట చాలా సార్లు వింటాం. వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదోక సందర్భంగాలో దానిని పాటించే ఉంటారు.

కానీ, దానర్థం మాత్రం తెలియదు. అర్చకులు చెప్పినట్లు చేతిలో నీరు పోసుకుని తాగేయడం పరిపాటి. కానీ, అలా ఎందుకు తాగమంటున్నారు. దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు.

సాధారణంగా గుడి వెళ్ళినప్పుడో, పూజా సమయంలోనో మనం ఆచమనాన్ని పాటించి ఉంటాం. సాంప్రదాయబద్ధంగానైతే రోజులో పలుమార్లు పాటిస్తారు

ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో భోజనానికి ముందు,

తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.

సంస్కృతంలోగోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, నీటిని పోసి, వాటిని తాగడం అన్న మాట.

చేతిలో పోసేనీళ్ళుకి కూడా కొలత ఉంటుంది. మూడు ఉద్ధరిణిల నీటిని మాత్రమే పోయాలి. అంటే ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు కొలత అంతే ఉండాలి.

ఎందుకు చేయాలి? ఏమిటి దాని వలన ప్రయోజనం అంటే, గతంలో మనం అనేక మార్లు భారతీయత, దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం. మన సాంప్రదాయం అంత గొప్పది.

భక్తి మాత్రమే కాదు అనువణువునా శాస్త్రీయత, ఆరోగ్య సూత్రం ఇనుమడింపజేస్తాయి. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఆచమనంలో కూడా అదే దాగి ఉంది.

మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది.

కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది.

చిన్న గాయం అయినా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.

ఇవి ఇంగ్లీషు అక్షరం ‘V’ ఆకారంలో మిళితమై ఉంటాయి. తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి.

స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,

గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి.

వీటికి బలం, వ్యాయం కలిగించి ఉత్తేజ పరచడమే ఆచమనం ప్రక్రియ. సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది.

ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఆచమనం పద్దతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది.

కేశవాయ స్వాహాఅనడంలో ఆంతర్యమేమిటి అంటే అది గొంతునుండి వెలువడుతుంది. ఇకనారాయణాయ స్వాహాఅనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.

చివరిగామాధవాయ స్వాహాఅనే మంత్రం పెదాలు మాత్రమే పలుకుతాయి. ఆచమనం ద్వారా గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.

ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలుగవచ్చు. మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది.

చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఉద్దరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.

ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال