Pooja Procedure of Maa Godess Sri Maha Lakshmi Devi(లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉండ లాంటే పూజ ఈ విధంగా చేయండి)


ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి.. అప్పుల బాధ తాళలేకపోతున్నాం.. .అసలు మాకు లక్ష్మీ కటాక్షము సిద్ధించడం లేదు".. ఇలాంటి సమస్యలే తరచూ చాలా మంది నుంచి వింటుంటాం. ఎన్ని పూజలు చేసినా.. ఎన్ని మొక్కులు నెరవేర్చినా సమస్యలను మమ్మల్ని వదలట్లేదని వాపోతుంటారు. కొంతమందైతే యజ్ఞాయాగాదులు నిర్వహిస్తుంటారు. అయితే వీటన్నింటికంటే ముందు లక్ష్మీ పూజను తప్పనిసరిగా చేయించాలి. అంతేకాకుండా కింది వివరించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తే బాధలు తొలగుతాయి పండితులు చెబుతున్నారు.

అమృత ప్రాప్తి మంత్రం...
"
శంఖినీ యక్షిణీ సాధన మంత్రం.. శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా".. మంత్రాన్ని వట వృక్షం(మఱ్ణి చెట్టు) కూర్చొని పదివేల సార్లు జపించాలి. మంత్రాన్ని జపించే ముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి, సూర్యోదయానికి ముందుగానే ముగించుకోవాలి. నెయ్యితో వెయ్యిసార్లవరకు మంత్రాన్ని హవనం(హోమం) చేస్తే.. చంద్రికా యక్షిణీ ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే మంత్రం ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుపడితేవారు జపించకూడదు. అన్నివిధాలుగా పవిత్రంగా వుండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాంటివారికే పలితాలు దక్కుతాయి. ఇతరుల ఎంతచేసినా ఫలితం శూన్యం.

అప్పుల బాధ తొలగాలంటే చేసే పూజ..
రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఎంతవాడైనా ఏదొక సమయంలో అప్పు చేయక మానరు. అయితే ఇందులో ఒకసారి కూరుకుపోయిన వారు బయట పడటం చాలా కష్టం. అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ కొన్ని సార్లు ఇందులో నుంచి బయటం పడటం అంత సాధ్యం కాకపోవచ్చు. అయితే భక్తి, నిష్ఠలతో భగవంతుడిని నమ్మినవారికి మాత్రం బాధల నుంచి ఉపశమనం పొందే అవకాశముంది.


ఇందుకు మీరు చేయవల్సిందిల్లా దీపావళి పర్వదినాన అర్ధరాత్రి 12 గంటలకు 5 గులాబీ పూలను తెచ్చుకోవాలి. అనంతరం ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకుని మీ ముందు పరచుకోవాలి. వస్త్రాన్ని నాలుగు వైపులా మడుచుకోవాలి. తర్వాత గాయాత్రి మంత్రాన్ని భక్తి నిష్ఠలతో పటిస్తూ ఐదు గులాబీలను తెల్లటి వస్త్రంలో ఉంచాలి. విధంగా జపించిన పిమ్మట వస్త్రాన్ని భద్రందా ఒకచోటు దాచిపెట్టుకోవాలి. విధంగా చేస్తే దేవి అనుగ్రహం పొంది అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال