హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ చేసింది తక్కువ సినిమాలే అయినా, బోల్డంత పాపులారిటీ సంపాదించేసింది. అంతా ఆమె హాట్ అప్పీల్ కారణంగానే. సోషల్ మీడియాలో యాక్టివ్గా వుండే ఈ బ్యూటీ, ఇదిగో ఇలాంటి హాట్ ఫొటోలతోనే కిర్రాకు పుట్టించేస్తూ అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో దళపతి విజయ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అన్నట్టు, మాళవిక మోహనన్ చేతిలో ఓ సినిమా కూడా వుంది. అయితే, ఆ సినిమా పరిస్థితేంటో ఎవరికీ తెలియదు.
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో స్టార్ట్ అయిన ‘హీరో’ సినిమా అది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెల్సిందే. ఆగిపోలేదని విజయ్ దేవరకొండ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో కన్ఫ్యూజన్ పెరిగింది. ఇక, మాళవిక విషయానికొస్తే, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో చూసి, ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపమాకే’ అంటోంది కుర్రకారు.
Tags
Movie News