Importance of God Shiva Pooja on Monday(సోమవారం మాత్రమే శివుడిని ఎందుకు పూజిస్తారు?)


హిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు పరమేశ్వరుడు. అయితే మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. ఇలా పూజించడానికి ప్రత్యేకమైన కారణముంది. 'సోమ' అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, శివుడు గురించి పురాణాల్లో ఆసక్తికరమైన కథ ఉంది.


దక్ష రాజు తన 27 మంది దత్త పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే వీరందరిలో చంద్రుడికి రోహిణి అంటేనే ఎంతో ఇష్టం. ఆమెతో ఎక్కువగా గడుపుతూ.. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిణి సోదరీమణులు తండ్రి దక్ష రాజుకు ఫిర్యాదు చేస్తారు. ఇందుకు దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమాలినా, హెచ్చరించినా ప్రయోజనముండదు. దీంతో కోపోద్రేక్తుడైన దక్ష రాజు.. చంద్రుడిని శపిస్తాడు. ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా.. తన మెరుపును, పరిమాణంలోనూ కుంచించుకుపోతాడు.

తనకు ఆపద దక్ష శాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు.. సహాయం కోసం బ్రహ్మదేవుడు శరణుగోరుతాడు. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న విధాత.. సమస్యకు పరిష్కారమార్గం శివుడొక్కడే చూపించగలడని చంద్రుడికి చెప్పగా.. అతడు శివుడికి తన గోడును వెల్లబోసుకున్నాడు. పరమ భక్తితో మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేత్రుడిని సంపన్నం చేసుకంటాడు చంద్రుడు. అయితే అప్పటికే దక్ష శాపం ప్రభావం చూపిచడం మొదలు పెట్టాగా.. శాపాన్ని పూర్తిగా ఉపసంహరింపలేకపోతాడు శివుడు.

అందువల్ల పదిహేను రోజులకోసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ.. మిగిలిన 15 రోజులు కుదించికు పోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. కారణంగానే మనకు పౌర్ణమి, అమవాస్యలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడని అని కూడా పిలుస్తుంటారు. కారణంగానే చంద్రుడిని సోమవారం రోజు పూజించడం మొదలుపెట్టారు. రోజు మహేశ్వరుడిని సేవిస్తే సమస్యల నుంచి మహాదేవుడు తమను రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال