Health Benefits of Sprirulina(హెల్త్ బెనిఫిట్స్ అఫ్ స్పిరులీనా )


పోషకాహారలోపం ఉన్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరున్నది కూడా భారత్లోనే. రెండింటికీ సంబంధం ఏంటంటారా... ఒక్క గ్రాము స్పిరులీనా నాచులో కిలో పండ్లూ కూరగాయల్లోని పోషకాలుంటాయి. ‘మరి మన పిల్లలు ఎందుకు పోషకాహారంలోపంతో బాధపడుతున్నారు..?’ కుర్రాడి మనసును తొలిచిన ప్రశ్నే స్పిరులీనా స్వచ్ఛంద సంస్థకు పునాది అయింది.

లోపలికెళ్లిపోయిన కళ్లూ ముడుచుకుపోయిన పొట్టా ఎముకల గూడులా ఉన్న రూపం... మురికివాడల్లోని పిల్లల్ని చూసి అందరూ జాలి పడతారు. కానీ 21ఏళ్ల మహేష్ఆర్‌.వి అక్కడితో ఆగిపోలేదు. వారికోసం ఏదో ఒకటి చెయ్యాలని తపించాడు. బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్చదువుతున్న అతడికి అప్పుడే స్పిరులీనా నాచు మొక్క ఉపయోగాల గురించి తెలిసింది. దీంతో చేసిన ఒక్క గ్రాము పిండిలో కిలో పండ్లూ కూరగాయల్లో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. అందుకే, పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా దీన్నో మందుగా ఇస్తున్నారు. ఆశ్చర్యపోయే విషయమేంటంటే దీన్ని అత్యధికంగా ఎగుమతి చేస్తున్నది మనదేశమే. మరోపక్క చూస్తే మనదగ్గరే అయిదేళ్లలోపు పిల్లల్లో దాదాపు సగంమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అందుకే, స్పిరులీనాను సాగు చెయ్యడం నేర్చుకుని, కర్ణాటకలోని తుమకూరులో ఉన్న తన ఇంటి దగ్గరే తొట్టెలో నాచు మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాడు మహేష్‌. అలా పెంచిన స్పిరులీనాను ఎండబెట్టి పిండిగానూ మాత్రలుగానూ చేసి, స్థానికంగా ఉన్న అనాథాశ్రమంలోని 110మంది పిల్లలకు అందించేవాడు. కొద్దిరోజుల్లోనే పిల్లల్లో ఎంతో మార్పు వచ్చింది. వూత్సాహంతోనే చదువు పూర్తయ్యాకస్పిరులీనా ఫౌండేషన్‌’ పేరుతో 2010లో స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సంస్థ స్పిరులీనా పంటను సాగు చేసి, మాత్రల రూపంలో కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనాథాశ్రమాలూ, అంగన్వాడీ కేంద్రాలూ, మురికివాడల్లోని పిల్లలకు పంచుతోంది.

ప్రభుత్వ పథకంలోనూ

బయోకాన్‌, జేఎస్డబ్ల్యూ, స్కానియా ఇండియా సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటుచేసిన సేవా విభాగాలు కూడా మహేష్తో కలసి చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరిమి కొట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి తరఫున వలంటీర్లు గ్రామాలూ మురికివాడలకు వెళ్లి ఉచిత ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తారు. చిన్న వయసులో పోషకాహారలోపం వల్ల మెదడు ఎదుగుదల తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గి పిల్లలు రకరకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు... విషయాల గురించి చెబుతూ స్పిరులీనాలోని పోషక విలువల గురించి అవగాహన కల్పిస్తూ మాత్రల్ని ఉచితంగా అందిస్తారు. అవసరాన్ని బట్టి దేశంలోని వివిధ ప్రాంతాలకూ వీటిని సరఫరా చేస్తోందీ సంస్థ. మహేష్ఆలోచన నచ్చడంతో కర్ణాటకస్త్రీ శిశు సంక్షేమ శాఖకూడా చిన్నారులూ పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమంలో సేవలందించేందుకు అతడిని ఆహ్వానించింది. అంతేకాదు, 2016-17 సంవత్సర బడ్జెట్లోబాల పోషణ పథకంకింద 25వేల మంది పిల్లలకు స్పిరులీనాను అందించాలని నిర్ణయించింది. ‘ఇప్పటివరకూ 225కు పైగా పట్టణాల్లో ముప్ఫైలక్షలకు పైగా స్పిరులీనా మాత్రల్ని పంచాం. రోజూ ఒక గ్రాము స్పిరులీనాను తీసుకున్న పిల్లల్లో ఐరన్లోపం 59శాతం, మొత్తం పోషకాహార లోపం 58 శాతం తగ్గడం గుర్తించాంఅంటాడు 26 ఏళ్ల మహేష్‌. అతడి సేవల్ని గుర్తించిటాప్‌ 100 ఇంపాక్ట్ఇన్నోవేటర్స్‌’లో ఒకడిగా 2014లోనే మహేష్ను ఎంపికచేసింది యాక్షన్ఫర్ఇండియా ఫోరం. ప్రధానమంత్రిసాంసద్ఆదర్శ్గ్రామ్యోజనకింద స్థానిక గుబ్బి గ్రామ అభివృద్ధిలో భాగమయ్యేందుకు కూడా స్పిరులీనా ఫౌండేషన్ఎంపికైంది.

స్పిరులీనా...

ఇది 350కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క(బ్లూ గ్రీన్ఆల్గే). దీన్లో వంద రకాలకు పైగా విటమిన్లూ ప్రోటీన్లూ ఇతర పోషకాలూ ఉంటాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషకాలూ గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేల్చేసింది.

ఐక్యరాజ్యసమితి 1975లోనేస్పిరులీనా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారంఅని చెప్పింది.

దీన్లో పాలలోకన్నా 26 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. 60శాతం ప్రొటీన్లుంటాయి. భూమ్మీద ప్రొటీన్లు అత్యధికంగా ఉండే ఆహారం ఇదే. అమైనో యాసిడ్లూ, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్పుష్కలంగా ఉంటాయి.

క్లోరోఫిల్రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్‌, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, అల్జీమర్స్అలర్జీలు, వాపులూ... లాంటి ఎన్నోరకాల వ్యాధులు రాకుండా స్పిరులీనా అడ్డుకుంటుంది. అరుగుదలకు చక్కని ఔషధం. శరీరంలోని పీహెచ్స్థాయుల్నీ, హార్మోనుల పనితీరునూ క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో కొవ్వుస్థాయుల్ని పెరగనివ్వదు. శరీరంలోని అనవసరపు వ్యర్థాల్ని తొలగిస్తుంది. బరువు పెరగనివ్వదు. ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. అందుకే, నాసా పరిశోధన సంస్థ ఎన్నో ఏళ్ల కిందటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల ఆహారంలో స్పిరులీనాను భాగం చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال