How to Prevent Sneezing Cold with Turmeric(పసుపుతో ఇలా చేస్తే తుమ్ములు, జలుబు మాయం )


పసుపులో వున్న క్రిమిసంహారకశక్తి గురించి ఎన్నో తరాల నుండి భారతీయులు గుర్తించారు. పసుపు ఆహారానికి రుచి, రంగు సువాసనలు కలిగిస్తుంది. పసుపు పారాణి మంగళకరమైనది. మన సంస్కృతిలో స్త్రీ సౌభాగ్యానికి పసుపుకున్న ప్రాధాన్యత గొప్పది.

పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. రోజూ కుంకుడు గింజంత పసుపు ఉండలాగ చేసుకుని నీటితో మింగితే సరిపోతుంది. పసుపుకొమ్మును నిప్పులపై కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్మును నమిలితే పంటిపోటు తగ్గుతుంది, నోరు శుభ్రపడుతుంది, నోట్లో పుళ్ళు వుంటే తగ్గుతాయి. పసుపును కామెర్ల వ్యాధికి వాడతారు. కామెర్ల వ్యాధిలో కళ్ళు, చర్మం, మూత్రం అంతా పసుపురంగులోనే వుంటాయి. అది వ్యాధి లక్షణం

కప్పు పాలల్లో ఒక పసుపు కొమ్మును ముక్కలుగా చేసి బాగా మరగకాయాలి. అలా మరగబెట్టిన పాలను ఉదయం, సాయంత్రం రోజూ త్రాగితే క్రమేణా కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అంతేకాదు పసుపుకు నాలుగు రెట్లు పెరుగు కలిపి రోజూ తింటే తగ్గిపోతాయి

శరీరంలో వున్న విష పదార్థాల్ని వెళ్ళగొట్టే శక్తి పసుపుకు వున్నది. అందుచేతనే దీనిని ఆహారంలో వాడుతారు. పసుపును నిప్పులపైన వేసి పైన వచ్చే పొగను పీలుస్తుంటే తుమ్ములు రావడం, జలుబుతో ముక్కు నుండి నీరు కారడం ఇలాంటి లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి.

కాళ్ళు, చేతులు చల్లబడిపోయి - షాక్కు గురియైన రోగికి పసుపు పొడిని, వెల్లుల్లిని కలిపి మెత్తగా నూరి అరికాళ్ళకు, అరిచేతులకు రాస్తే రోగి కోలుకుంటాడు. చల్లబడిన శరీరం వేడెక్కుతుంది. పసుపు పొడిని వేడినీళ్ళలో కలిపి పుళ్ళు, గజ్జి కురుపులను కడుగుతూ వుంటే అవి త్వరగా మానతాయి. ఇది యాంటిసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది. మడమశూల అనేది ఒక వయస్సు వచ్చిన వారిలో చాలామందిలో వస్తుంది. సమస్యకు పసుపు పొడి బాగా పనిచేస్తుంది

ఆడవారికి నెలసరి దోషాల్ని పసుపు తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఐదు గ్రాములకు మించకుండా పసుపును చిన్న మాత్రలుగా చేసుకొని వాడుకోవాలి. ఈవిధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇతర బాధలు పోతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال