అశ్వగంధకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది. అశ్వగంధ చెట్టు మొత్తం వైద్య గుణాలు కలిగివున్నాయి. అశ్వగంధలో బ్యాక్టీరియాలను హతమార్చే గుణం వుంది. తద్వారా యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. శ్వాస సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. అశ్వగంధ ద్వారా మానసిక ఒత్తిడి వుండదు.
అలసట, నీరసం తొలగి కొత్త ఉత్సాహం పొందేలా.. ఇందులోని అటోప్టోజోనిక్ మెరుగ్గా పనిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఇన్సులిన్ ఉత్పత్తి కోసం అశ్వగంధను ఉపయోగించవచ్చు. అశ్వగంధ పొడిని రోజు ఓ స్పూన్ తీసుకుంటే.. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరించవచ్చు.
మోకాలి నొప్పులు, మోకాలి వాపు తగ్గిపోతాయి. క్యాన్సర్కు అశ్వగంధ దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కారకాలను, కణతులను ఇది తొలగిస్తుంది. ఇంకా గుండె సంబంధిత రోగాలను, ఒబిసిటీని ఇది దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి ఈ అశ్వగంధంతో కరోనాకు మందు తయారీలో నిమగ్నమైంది భారత్. కరోనా డ్రగ్, వాక్సిన్ కోసం పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. మనదేశం కూడా తన ప్రయత్నాలు కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాపై కొత్త అస్త్రం సంధించింది భారత్. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే చోట పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి అశ్వగంధతో పాటు పలు ఆయుష్ ఔషధాలను అందజేస్తోంది.
దీనికి సంబంధించి గురువారం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. దేశంలో కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది మీద అశ్వగంధ, యష్టిమధు, గుడుచి పిప్పలి, ఆయుష్-64 వంటి ఆయుష్ ఔషధాలను ప్రయోగాత్మకంగా పరిశీలించే క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.
Tags
Health & Fitness