Cow Appeared with Lord Sri Venkateswara Swamy Tirunamam(తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు ప్రత్యక్షం )


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్న క్షేత్రంలో వింత సంఘటన చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల చెంత తిరునామాలతో కనిపించిన గోవు అందరినీ ఆకట్టుకుంటుంది. అలిపిరి వద్ద గోవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నుదుటిపై ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి ధరించే తిరునామం మాదిరిగానే గోవుకు కూడా నుదుటిపై పెద్ద ఆకారంలో సహజసిద్ధంగా కలిగి ఉంది.
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రోజూ గ్రాసం అందిస్తోంది. దీంతో గోవులన్నీ కడుపు నింపుకుంటున్నాయి. క్రమంలోనే గోవు నుదిటిపై తిరునామం ధరించినట్లుగా ఉండటాన్ని ఉద్యోగులు గుర్తించారు. అయితే తిరునామం ధరించిన ఇలాంటి అరుదైన గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలిస్తే భక్తులు వీక్షించడానికి బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేయటంతో, నామాల గోవును టీటీడీ అధికారులు గోశాలకు తరలించినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే, గత 45 రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే రోజూ స్వామివారికి కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయి. కాగా, వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చి.. లాక్ డౌన్ ఎత్తివేసేంత వరకు దర్శనాలకు అనుమతి ఉండబోదని టీటీడీ అధికారులు తేల్చి చెబుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال