జబర్దస్త్ షోతోనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షోలతో అకట్టుకుంటుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై గ్లామర్ తో అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి షో వచ్చినా అందులో అనసూయా మార్క్ గ్లామర్ షో ఉంటుందనే చెప్పాలి. ఇక ఈ బ్యూటీ మాటలతో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. టాలీవుడ్ రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుందనే చెప్పాలి.
రంగస్థలం సినిమాలో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపించి అనసూయ రంగమ్మత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. బయట ఎక్కడా కనిపించినా కూడా అభిమానులు ఆమెను ఎక్కువగా రంగమ్మత్త అంటూ స్వీట్ గా పిలవడం అనసూయకు కూడా బాగా నచ్చేసింది. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనసూయ ఇండస్ట్రీలో బిజీగా మారింది. కుదిరితే గెస్ట్ రోల్స్ చేస్తోంది. పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ బికినీపై క్లారిటీ ఇచ్చింది. అనసూయ సినిమాలో బికినీలో కనిపించే ఛాన్స్ ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇంకా అలాంటి సమయం రాలేదు, ఒకవేళ పాత్రకు తగ్గట్టు అలా కనిపించాల్సి వస్తే బికినిలో కనిపించే ఛాన్స్ ఉండవచ్చు అని తెలిపింది. ఫైనల్ గా ప్రస్తుతానికి మాత్రం తాను బికినీలో కనిపించడానికి సిద్ధంగా లేనని చెప్పిన అనసూయ అవకాశం ఉంటే అలా కనిపించడానికి ఛాన్స్ లేకపోలేదని క్లారిటీ ఇచ్చింది.
Tags
Movie News