కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచదేశాల్లోనూ విలయతాండవం చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే ఇక్కడ మరణాల సంఖ్య 50 వేలు దాటేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 29 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.90 లక్షలు మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. ఈ క్రమంలోనే కరోనాకు చెక్ పెట్టేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. ప్రజలను బయటకు రాకుండా కఠన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇక ప్రస్తుతం కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న వేళ చేతులు కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అంటూ ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు. అయితే కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో వాట్సప్ ఒప్పందం చేసుకొని 21 స్టిక్కర్లను రూపొందించింది. వాట్సప్లో టుగెదర్ ఎట్ హోమ్ పేరుతో స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది. వాటిని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపొచ్చు. ఇంట్లో గడిపే అంశాలపై సందేశాత్మకంగా ఉన్న 21 స్టిక్కర్ల ప్యాక్ హిందీ, ఇంగ్లిష్ భాషలతోపాటు మొత్తం 11 భాషల్లో వాట్సాప్ వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది.
అయితే మరి వీటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మీ వాట్సప్లో ఛాట్ విండో ఓపెన్ చేసి.. టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఇప్పటికే మీరు డౌన్లోడ్ చేసుకున్న స్టిక్కర్స్ లిస్ట్ కనిపిస్తుంది. చివర్లో కనిపించే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి.అందులో ఆల్ స్టిక్కర్స్ లిస్ట్‌లో టుగెదర్ ఎట్ హోమ్ పేరుతో స్టిక్కర్ ప్యాక్ ఉంటుంది. ఆ స్టిక్కర్ ప్యాక్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో ఆ 21 స్టిక్కర్స్ మీ వాట్సప్లో స్టిక్కర్స్ లిస్ట్లోకి వచ్చేస్తాయి.