ప్రస్తుతం లోకం అంత యూట్యూబ్ మాయలోనే పడింది. ఇప్పుడు అంటే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాయి కానీ ఇంతవరుకు ఏం ఉన్నాయి? ఓన్లీ యూట్యూబ్ ఏ కదా! అనుకుంటాం కానీ అండి.. మనం ఏదైనా ఒక సినిమా సిన్ చూడాలి అన్న యూట్యూబ్ ఏ ఆన్ చేస్తాం..
ఎదైనా ఒక పాట పడాలి అన్న యూట్యూబ్.. అంత యూట్యూబే ఇప్పుడు. అయినా ఇప్పుడు కరోనా దెబ్బతో లాక్ డౌన్ ప్రకటించారు.. ఈ లాక్ డౌన్ లో అందరూ ఎం చేస్తారు? ఇంట్లో ఉండి కామెడీ సీన్లు.. మెలోడియస్ పాటలు.. యాక్షన్ సీన్లు.. కార్టూన్స్ అన్ని యూట్యూబ్ లో పెట్టుకొని చూడటమే పని.
అలాంటి యూట్యూబ్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు యూట్యూబ్ లో 1స్ట్ వీడియో అప్లోడ్ అయ్యింది అని ఎవరైనా గమించరా? లేదే.. అందుకే ఇప్పుడు చెప్తున్నా.. తెలుసుకోండి.. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఉపయోగ పడుతుంది.. మన యూట్యూబ్ వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. అమెరికాకు చెందిన ముగ్గురు సహోద్యోగులు స్టీవ్ చేన్, చాద్ హర్లే, జావేద్ కరీం కలిసి యూట్యూబ్ ని స్థాపించారు.
ఇందులో 1స్ట్ వీడియో ఇందులో ఎప్పుడు అప్లోడ్ అయ్యింది అంటే? 2005 ఏప్రిల్ 24న మొదటి వీడియోను అప్లోడ్ చేశారు. ఇందులో యూట్యూబ్ స్థాపకుడు అయినా జావేద్ కరీం.. కాలిఫోర్నియా శాన్డియాగోలోని ఒక జూలో నిలబడి మాట్లాడే 18 సెకండ్ల వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోను ఇప్పటివరకు 90 మిలియన్ల మంది వీక్షించారు. ఆ తర్వాత నెమ్మదిగా యూట్యూబ్కు మంచి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన గూగుల్.. 2006లో 1.6 బిలియన్ డాలర్లకు దీన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గూగుల్ ఆదాయ వనరుల్లో యూట్యూబ్ది ప్రధాన పాత్ర. దీని ద్వారా 2019 ఆర్థిక సంవత్సరంలో 15.15 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.