ప్రియాంక
చోప్రా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని
పేరు. తన అందం
, అభినయంతో స్టార్ హీరోల స్థాయికి ఎదిగింది.
తన నటన జీవితాన్ని ప్రారంభించక
ముందు, మోడల్గా పనిచేసిన
ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ
సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఫుల్ పాపులర్ అయింది..
ప్రియాంక బాలీవుడ్ లో తన సత్తా
చాటి హాలీవుడ్ లో తానేంటో నిరూపించుకుంది.
దీంతో ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్.
దేశీ ఆహారాన్ని ఇష్టపడటమే కాకుండా, ఇక్కడ నేర్చుకున్న అనేక
బ్యూటీ హోమ్ రెమెడీస్ని
పాటిస్తుంటుంది. ముఖ్యంగా ఆమె ఎప్పటికప్పుడు తన
ఇన్స్టాగ్రామ్లో
బ్యూటీ టిప్స్ని పంచుకుంటుంది. ఈ
చిట్కాని తాను తన తల్లి
వద్ద నుంచి నేర్చుకున్నానని తెలిపింది.
ఈ వీడియోలో, ప్రియాంక చోప్రా ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు , ఒక టీ స్పూన్ తేనె, ఒక గుడ్డును బాగా కలిపి ఒక ప్యాక్ లా చేసారు. ఈ ప్యాక్ కురులకు వేసుకొని గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే అందమైన, దృఢమైన కురులు మీ సొంతం అవుతాయి. ఈ ప్యాక్ జుట్టు రక్షణకు అద్భుతంగా పని చేస్తుంది. ఈ టిప్ చాలా ఈజీ అని అనిపించొచ్చు. కానీ, ఇవి మీ జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. లాక్టిక్ యాసిడ్ తో నిండిన పెరుగు కురులను శుభ్రపరచడానికి, మృత చర్మ కణాలను తొలగించడానికి సాయపడుతుంది. మీకు పొడి, నిర్జీవమైన జుట్టు ఉంటే, అప్పుడు ఈ ప్యాక్ లో తేనె వేస్తే అద్భుతంగా పని చేస్తుంది. తేనె యాంటీఆక్సిడెంట్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇది జుట్టు పగుళ్ళను తగ్గించడానికి, అదే విధంగా జుట్టు సహజంగా కండిషనర్గా బాగా పనిచేస్తుంది.

పెరుగు
చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు. మరియు ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే వస్తువుల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే అనేక మంది పెరుగును ఎప్పుడు తమ భోజనంలో ఉండేలా చూసుకుంటారు. అయితే పెరుగు కేవలం ఆరోగ్యానికే మాత్రమే కాదు, కురులు, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేశాలకు సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్లే అనేక విధాలైన హెయిర్ ప్యాక్స్ లో పెరుగును ఉపయోగిస్తారు. మీ జుట్టు సమస్యలను తగ్గించుకోవాలనుకుంటే పెరుగును తప్పక ఉపయోగించాలి . పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. పెరుగు హెయిర్ కండీషనర్ గా పని చేస్తుంది. జుట్టు అందంగా కనిపించేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే పెరుగు కురులకు ఉత్తమంగా పని చేస్తుంది.
తేనె
ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన దివ్య ఔషధం తేనె. ఇందులోని బెనిఫిట్స్ని ఎంత వివరించిన తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. తేనె కు వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరియు శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. అయితే, తేనె కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు, చర్మ సంరక్షణకి అద్భుతంగా పని చేస్తుంది. తేనె జుట్టును ఒత్తుగా చేయడంతో పాటు పాటు మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. తేనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్. అందువల్ల జుట్టును కండిషన్ చేస్తుంది. మరియు జుట్టు చివర్లు చిట్లే సమస్యను తగ్గిస్తుంది. తేనె లో అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కాబట్టి.. ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కేవలం జుట్టును మాత్రమే కాదు.. కుదుళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు జుట్టు కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంతో పాటు చుండ్రు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకలు పెరగకుండా ఆగిపోయిన కుదుళ్ల నుంచి కూడా వెంట్రుకలు పెరిగేందుకు తేనె తోడ్పడుతుంది.
గుడ్డు
గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు అంటారు. ఎందుకంటే గుడ్డు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అందుకే మంచి ఆరోగ్యానికి రోజుకు గుడ్డు తినాలని చెపుతారు. అయితే గుడ్డు చర్మానికి మరియు జుట్టుకు అద్భుతంగా పని చేస్తుంది. గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అది మీ జుట్టుకు అద్భుతంగా పని చేస్తుంది. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, బయోటిన్ మరియు ఫోలేట్లతో నిండి ఉంటుంది, ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలతో ముడిపడి ఉంటాయి. జుట్టు సమస్యను అధిగమించడానికి గుడ్డు చెక్కటి పరిష్కారం. జుట్టుకు కోడి గుడ్డును రాసుకోవడం వల్ల జుట్టు రాలుపోవడాన్నీ నిరోధించడమే కాక మీ జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కోడి గుడ్డులో బయోటిన్ మరియు బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టును మూలాల నుండి బలోపేతం చేసి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది మరియు జుట్టును ఒత్తుగా చేస్తుంది.
చివరగా ప్రియాంక చోప్రా ఈ హెయిర్ మాస్క్ కోసం మరొక విషయాన్ని కూడా తెలిపింది. ఈ హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు జుట్టు వాసన వస్తుందని ఈ వాసనని తగ్గించుకోవాలంటే రెండుసార్లు కడగాలని బోన్ టిప్ చెబుతోంది.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ఇప్పుడుప్రియాంక తన భర్త నిక్తో కలిసి లాస్ ఏంజిల్స్లో నివసిస్తోంది. అయినప్పటికీ ఎప్పుడు తన దేశాన్ని, అక్కడి అలవాట్లను మర్చిపోదు. భారతదేశంలో వివాహం నుండి అన్ని పండుగలను జరుపుకునే వరకూ, ప్రియాంక ప్రతిసారీ భారతదేశంపై తన ప్రేమను చాటుతూనే ఉంటోంది.

Tags
Health & Fitness