ఉసిరి కాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయ రక్తపోటును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో సహా కండరాల నొప్పులు కూడా నయమవుతాయి. ఉసిరిక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
1. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరిక చూర్ణాల్ని వేసి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి పటికబెల్లం పొడి కలిపి తాగుతుంటే రక్తపు పోటు క్రమబద్దమవుతుంది. తలదిమ్ము, తలతిరగడం వంటి పైత్య వికారాలు తగ్గుతాయి. రెండింతల బెల్లం కలిపిన ఉసిరిక చూర్ణాన్ని గచ్చకాయ మోతాదులో సేవిస్తుంటే కీళ్లనొప్పులు, మలబద్దకం, మూలవ్యాధి, శిరోజాలు తెల్లబడడం, ఊడిపోవడం తగ్గుతాయి.
2. ఉసిరిక, శొంఠి, తిప్పసత్తు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక
స్పూను వంతున రోజూ రెండు
సార్లు తేనె లేదా పాలల్లో
కలిపి తీసుకుంటుంటే వీర్యవృద్ది అవుతుంది. శుక్రదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి3. ప్రతిరోజు అరస్పూను ఉసిరికపొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటుంటే శుక్రకణాల సంఖ్య పెరిగి సంతానవకాశాలు మెరుగవుతాయి.
4. ఉసిరిక, వేయించిన జీలకర్ర, ఎండుగులాబి పూలు, నల్లఉప్పు చూర్ణాల్ని సమంగా కలిపి ఒక స్పూన్ వంతున రోజూ రెండు సార్లు సేవిస్తుంటే కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, దుర్వాసన గల తేన్పులు, కడుపులో తిప్పినట్లుండడం, వాంతులు లాంటి సమస్యలు తగ్గుతాయి.
5. సమపాళ్లలో కలిపిన ఉసిరిక, పసుపుల చూర్ణాన్ని ఒక స్పూన్ వంతున రోజూ రెండుమూడు సార్లు పంచదార లేదా తేనె కలిపి సేవిస్తుంటే స్త్రీలల్లో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో కలిగే చురుకు, మంట తగ్గుతాయి. అంతేకాకుండా రక్తం శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గుతాయి.
Tags
Health & Fitness