గిన్నిస్ బుక్ గుర్తించిన నటి, దర్శకురాలు విజయనిర్మల. ప్రపంచంలోనే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా రికార్డ్. బాలనటిగా ప్రవేశం. హీరోయిన్గా, క్యారెక్టర్ నటిగా అనేక పాత్రల్లో నటించారు. కొత్తగా వచ్చే నటీమణులకు ఆమె స్ఫూర్తిదాయకం. ఇటీవలే మరణించిన విజయనిర్మల జీవితం తెరపై ఆవిష్కృతం కానుంది. అనేక మందికి నట జీవితాన్ని ప్రసాదించి, వారి ఎదుగుదలకి దోహదం చేసిన విజయనిర్మల బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. విజయనిర్మల అంటే ఒక చరిత్ర. ఆమె జీవితంలో అనేక పార్వ్శాలు న్నాయి. ఆమె చరిత్రను ఈ తరానికి అందిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సూపర్స్టార్ కృష్ణ సతీమణిగా విజయనిర్మల స్థానం ప్రత్యేకమైనది. ఇప్పుడు విజయనిర్మల బయోపిక్ ప్రయత్నాలను ఆమె ఏకైక కుమారుడు నరేష్ చేస్తున్నట్టు తెలిసింది. మహానటిగా సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించిన కీర్తి సురేష్ చేత విజయనిర్మల పాత్రను చేయించాలనే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. దీనిపై కీర్తి నుండి సమాచారం రావాల్సి ఉంది.
విజయనిర్మల వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పాత్రలో కీర్తి నటిస్తే ఆమె కీర్తి మరింత పెరుగుతుందని సనీ వర్గాలు భావిస్తున్నాయి. విజయనిర్మల బయోపిక్ వార్త కేవలం ప్రచారమేనా లేక నిజంగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.