ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి రంగంలోకి దిగి 87 సంవత్సరాల వయస్సులో కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న రుబెల్లా వ్యాక్సిన్ సృష్టి కర్త వ్యాక్సిన్ గాడ్ ఫాదర్ శాస్త్ర వేత్త డాక్టర్ స్టాన్లీ ప్లాట్ కివీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాకు చెందిన ఈ ప్రముఖ శాస్త్రవేత్త వ్యాక్సిన్ విషయంలో తనకు ఉన్న 60 ఏళ్ల అనుభంతో ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ను తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకుని సుమారు 50 మంది శాస్త్రవేత్తలతో ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. కరోనా కు వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రస్తుతం ఆయన రోజుకు 14 గంటలు చేస్తున్న కృషికి సంబంధించి కథనం చదివినవారు ఎవరైనా స్పూర్తిని పొందుతారు.
1960 సంవత్సరం ప్రాంతంలో అమెరికాను అతలాకుతలం చేసిన 'రుబెల్లా' వైరస్ కు వ్యాక్సిన్ ను కనుక్కున్న ఘనత ఈయనకు ఉండటంతో ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అయితే రుబెల్లా కన్నా అత్యంత ప్రాణాంతకమైన కరోనా ను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజులలో ప్రపంచ జనాభాలో 80 శాతం మందికి చాల వేగంగా కరోనా వ్యాధి సోకుతుంది అని అంచనాలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కరోనాకు వ్యాక్సిన్ కనుక్కునే బాధ్యతను డాక్టర్ స్టాన్లీ కి అప్పచెప్పి కొన్ని బిలియన్స్ డాలర్లను ఈ పరిశోధన నిమిత్తం ఖర్చుపెడుతోంది. గాడ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ గా పేరున్న డాక్టర్. స్టాన్లీ కరోనా కు విరుగుడు వ్యాక్సిన్ ఆరు నెలలలో తయారు చేస్తాను అని చెపుతూ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములుగా చేసుకునేందుకు కొన్ని పెద్దపెద్ద ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కేవలం ఒక అమెరికాలోనే కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న 40 రిసర్చ్ ప్రాజెక్ట్ లు నడుస్తున్నాయి అంటే ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం అమెరికా ఎంత తీవ్రంగా కృషి చేస్తాడో అర్ధం అవుతోంది..