Mega Star Chirangeevi with Grand Daughter Funny Video(మీ మీ పాట అడుగుతున్న చిరు మనవరాలు.)


సోమవారం క్రియేట్ చేసిన సస్పెన్స్కు చెక్ పెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. నిన్న చిరు ట్విట్టర్ వేదికగా నిన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణంగా, నేను పాటలు షూటింగ్ చేసే సమయంలో వాటిని వింటూ పూర్తిగా ఆనందిస్తాను. కానీ ఇటీవల, పాటను మాత్రం తరచూ పాజ్చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.
సరిగ్గా మంగళవారం తొమ్మిది గంటలకు ఆయన చెప్పిన విధంగా సస్పెన్స్కు తెర దించారు మెగాస్టార్. చిరు తరచూ వింటున్న పాట ఖైదీ నెంబర్ 150లోని మీమీ పాట. అయితే ఆయన ఎందుకు ఇదే పాటను పాజ్ చేస్తూ వింటున్నారో వీడియోతో సహా చూపించారు. తన మనవరాలిని ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు, తనకు పాట కావాలని అడిగారు. దానికి చిన్నారి మీమీ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ అదే పాటేనా మరో పాట విందాం అన్నారు. దానికి చిరు మనవరాలు బుంగమూతి పెట్టుకొని ఏడుపు ప్రారంభించేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال