ఈ జ్యూస్తో బీపీకి చెక్ పెట్టవచ్చు.


మనం ప్రతి నిత్యం మన ఆహారంలో ఉపయోగించే ధనియాల గురించి తెలియని వారుండరు . ధనియాల మొక్కల నుండి వచ్చే కొత్తిమీర మంచి సువావన కలిగి ఉంటుంది. ప్రతి తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో కొత్తిమీరను విరివిగా వాడతారు. జీర్ణ కోశ సమస్యలను తగ్గించడంలో కొత్తిమీరను మించిన ఓషదం లేదనే చెప్పాలి . దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాం.కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ వాసనలు , ఔషధ తత్వాలూ అనేకం కలిగి ఉన్నాయి . 

అయితే ప్రతిరోజూ ఉదయం పరగడపునే కొత్తిమీర జ్యూస్ ఒక గ్లాస్ తాగడం వల్ల మన బాడీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. అధిక బరువును సులభంగా తగ్గించు కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలోని ప్రత్యేక ఓషధి గుణాలు కిడ్నీల్లోని రాళ్లను బయటికి పంపడంలో బాగా సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ వంటి ఓషద గుణాలు కలిగిన కొత్తిమీర రసాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల తరుచుగా వచ్చే వైరల్ ఫీవర్స్, జలుబు వంటి సమస్యలు దూరంచేసుకోవచ్చు

కొత్తిమీర జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన చర్మసమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు తీవ్రమైన చర్మసమస్యలను నివారిస్తాయి. రక్తహీనతను నివారించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఐరన్ మన రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచుతుంది. ఆక్సిజన్ ప్రసరణను మెరుగు పరుస్తుంది. హైబీపీ దీర్ఘ కాలంగా ఉన్నవారు రోజూ ఉదయాన్నే కొత్తిమీర జ్యూస్ ఒక గ్లాస్ తాగితే బీపీ కంట్రోల్ అవుతుందని నిపుణులు ఒక పరిశోధనలో తేల్చారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال