`డ్రై ఫ్రూట్స్`తో అందం.. ఆరోగ్యం..!


సాధారణంగా డ్రైఫ్రూట్స్లో ఉండే పోషకాల గురించి చెప్పానక్కరలేదు . అంజీర్, బాదం, పిస్తా, అక్రోట్టు, ఆఫ్రికాట్, చెర్రి, ఖర్జూర, కాజు, కిస్మిస్, అల్ బుకార ఇలా ఎన్నో రకాలు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ పెంపొందానికి రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచిదని మనకు తెలిసిందే. అయితే డ్రై ఫ్రూట్స్తో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అనే  విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మరి  డ్రై ఫ్రూట్స్ తో ఉన్న  అందాలను ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

 - బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో ఒక రోజంతా నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై పేస్ట్ గా రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను, వేస్ట్ మట్టిని తొలగిస్తుంది. దాంతో ముఖం నిగ నిగ లాడిపోతుంది.

 - కంటిన్యూ హెయిర్ ఫాల్ , హెయిర్ డ్యామేజ్ మరియు ఇతర జుట్టు సంబంధిత సమస్యలను త్వరగా నివారించడంలో డ్రై ఫ్రూట్స్ గొప్పగా సహాయపడుతాయి. మరియు జుట్టు పెరగడంలో దోహదం చేసి జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

 - పెరుగులో కొన్ని వాల్ నట్స్ వేసి బాగా నానబెట్టి మరియు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు, గీతలు రాకుండా అరికడుతుంది .

 - రక రకాల డ్రై ఫ్రూట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే వృద్ధాప్య ఛాయలు మీ దరిచేయవు . ఇందులో వృద్ధాప్య ఛాయలను సములంగా నివారించే యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

 - రోజుకు కొంత మోతాదులో జీడిపప్పులు తినడం వల్ల ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని ఇది సరి చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال