నాలుగు యుగాల్లో దీపావళి రోజున లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?


మన పురాణాల్లో బలి చక్రవర్తి అనే పేరు మనం వింటున్నాము . బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది దీపావళి రోజునే !రావణుని లంకలో చంపి రాముడు సీతమ్మతో కలిసి వెళ్ళి భరతుని చూసినది కూడా రోజే! రాక్షసరాజు నరకాసురుని సత్యభామ కృష్ణుడు వెంట నుండగా హతమార్చినది దీపావళి రోజే ! విక్రమార్కుడు శత్రువులన్ని సంహరించి  విజయాన్ని సాదించి తన పేర శకము ప్రారంభించినది కుడా రోజే! "దీపావళి పర్వదినము". అలాంటి శుభ దీపావళి గూర్చి తెల్సుకుందాము.

శ్రీమహా విష్ణువు కృత యుగంలో వామనావతారుడై రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేశాడు. రోజు బలిపాలన అంతమైన రోజు. రోజున దీపావళిని దీప కాంతులతో జరుపుకున్నారు.ద్వాపర యుగంలో నరకాసురుణ్ణి సంహరించిన రోజునే దీపావళిగా మనం జరుపుకుంటూ ఉన్నాం . అలాగే  త్రేతాయుగంలో శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి తిరిగి రోజు అయోధ్యలోకి అడుగు పెట్టిన రోజు దీపావళి  శుభదినం.

దీపావళి పర్వదినం రోజు మహాలక్ష్మీదేవిని సర్వోపచారాలతో యుగ యుగాలుగా మనము పూజిస్తునాం . దీపావళి పర్వదినం రోజున ప్రత్యేకించి  శ్రీ మహా లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణాలు ఏంటంటే?

ఒకనొక సమయంలో తన దీనస్థితి నుంచి గట్టెక్కేందుకు ఇంద్రుడు శ్రీహరిని ప్రాద్దించగా .. ఒక దీపాన్ని వెలిగించి దాన్నిశ్రీ మహా లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పాడు. పూజలు చేసిన దేవేంద్రునిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షం లభించింది. దీంతో ఇంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొంది దేవలోకాధిపత్యం సాధించాడు .

దీపావళి రోజున సాయంకాలం ధనలక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి. దీపముల వరుసలతో మన ఇంటిని అలంకరించుకుంటాము కనుక రోజును దీపావళి అంటారు. అలాగే ద్వాపర యుగంలో సత్యభామదేవి నరకాసుని సంహరించిన రోజు నరక చతుర్దశి అని . ఆనందతో బాణసంచా పేల్చి మన ఇంటిని దీపాలతో అలంకరించు కొని ఆనందంగా దీపావళిని జరుపుకొంటున్నామ్ ఇదే మన సంప్రదాయంగా యుగ యుగాలుగా జరుపుకొంటునాము . దీపావళితో ఆశ్వీయుజంలో చివరి మూడు రోజుల పండగ వల్ల మన పితృదేవతలకు ఉత్తమ లోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال