ఈ రోజు ఫిట్నెస్ కోసం చేసే వర్కవుట్కు ముందు, వర్కవుట్ తరువాత ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకుందాం. మనకు సాధారణంగా వర్కవుట్కు ముందు, తర్వాత ఏం తినాలి? అనే విషయం గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి. వ్యాయామాలు చేయడానికి సరిపడా శక్తి అందండంతో పాటు, వ్యాయామం తర్వాత అలసటను తొలగించే కొన్ని స్నాక్స్ గురించి తెలుసుకుందాం.ఎలాంటి వ్యాయామాలు చేస్తప్పుడు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి అనే విషయం కూడా తెలుసుకుందాం.
కార్డియో:
కార్డియో వ్యాయామాలు చేసేవారు ఆ వ్యాయామాలకు అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తినాలి. ఈ స్నాక్ సుమారుగా 150 కేలరీల శక్తి అందుతుంది. కార్డియో తర్వాత 3/4 కప్పుల చాక్లెట్ మిల్క్ తాగవచ్చు. ఒక చిన్న అరటిపండు తినవచ్చు. ఈ స్నాక్లో అలసిన కండరాలకు సరిపడా ప్రొటీన్ ఉంటుంది.
హిట్ క్లాసెస్:
సర్క్యూట్/ఇంటర్వెల్ వర్కవుట్స్ చేసేవారు రెండు స్లైసుల బ్రౌన్ బ్రెడ్, పళ్లతో తయారైన జామ్తో కలిపి తినవచ్చు. ప్రొటీన్లు, ఫ్యాట్స్ ఏమాత్రం లేని ఈ స్నాక్తో 160 కేలరీల శక్తి అందుతుంది. వర్కవుట్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అవకాడో, 3 టేబుల్ స్పూన్ల ష్రెడెడ్ చీజ్ తినాలి. దీన్లో సరిపడా కొవ్వులు, ప్రొటీన్తో పాటు 171 కేలరీలు కూడా ఉంటాయి.
వెయిట్ ట్రైనింగ్:
ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ, చిక్కుళ్లు తినవచ్చు. దీన్లో 190 కేలరీలు ఉంటాయి. నాన్ఫ్యాట్ యోగర్ట్, పావు కప్పు స్ర్టాబెర్రీలు తినాలి. పళ్ళ రసాలు కూడా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇక కొబ్బరినీళ్లు శరీరంలో కోల్పోయిన గ్లూకోజును అందించి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ఈ ఆహారమైన సరే ముందుగా మన శరీర తత్వానికి సరిపోతుందో లేదో పరీక్షించి తీసుకోవడం ఉత్తమం. అలాగే అన్నివేళలా సరిపడా నీళ్లు తాగడం మర్చిపోకండి. ఇవండీ! వ్యాయామాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన సాక్స్.
Tags
Health & Fitness