ఉప్పు
భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి.
ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము
సోడియం క్లోరైడ్. నిత్యం మనం చేసుకునే ఏ
వంటలో అయినా ఉప్పు కచ్చితంగా
ఉండి తీరాల్సిందే. ఉప్పు లేకుండా కూరలను
చేసుకుని తింటే అవి రుచించవు.
అలా అని ఉప్పు ఎక్కువైనా
తినలేం. అయితే ఉప్పు
ఎక్కువైతే వంటకం ఎలా తినటానికి
పనికిరాకుండా పోతుందో అలాగే మన ఆరోగ్యం
కూడా దెబ్బతిని ఉపయోగం లేకుండా పోతుంది.
ఉప్పు
వాడటం మంచిదే అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య
సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సగటు మానవుడు ఆరోగ్యంగా
ఉండాలంటే ఆహారంలో కొన్ని పరిమితులు పాటించాలి. ఉప్పు ఎక్కువగా తినడం
వల్ల శరీరం డీహైడ్రేషన్కు
లోనవుతుంది. ఒంట్లో ద్రవాల పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా దాహం అధికంగా అవుతుంది.
దీంతో వికారం, వాంతులు, కళ్లు తిరగడం, డయేరియా
వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం పరిమాణం పెరిగితే క్యాల్షియం తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు
డొల్లగా మారుతాయి. కీళ్ల నొప్పులు వస్తాయి.
ఉప్పు
ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే మరో
నష్టం నాలుకపై ఉండే రుచి కళికలు
ఇతర రుచులను గుర్తించలేవు. దీంతో ఏది తిన్నా
సహించదు. ఉప్పు ఎక్కువగా ఉండే
ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలనిపిస్తుంది. దీంతో బరువు పెరిగే
అవకాశం కూడా ఉంది. ఉప్పును
మోతాదుకు మించి తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు వచ్చే
అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే విపరీతమైన ఉప్పు
వాడకం జీర్ణాశయ గోడల్ని నాశనం చేస్తుంది. దాంతో
ఇన్ఫెక్షన్లు, వాపు, క్యాన్సర్ సమస్యలు
బాధిస్తాయి.
Tags
Health & Fitness