సాధారణంగా చిలకడదుంపలు
తెలియని వారుండరు.
చిలకడదుంపల వల్ల ఎన్నో
ఆరోగ్య సంబంధ ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార
నిపుణులు సూచిస్తారు. సమతుల ఆహారంలో చిలకడదుంపలకే
అగ్రస్థానం. ఈ తియ్యని దుంపలు
ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని
కాపాడతాయి. ఉడకబెట్టి, నిప్పులపై కాల్చుకుని తింటే రుచి చాలా
బాగుంటుంది. వీటిల్లో ఫైబర్, విటమిన్లు ఎ,సి,డి,
కాల్షియం, పొటాషియం, ఐరన్లు పుష్కలంగా
ఉన్నాయి. ఒక కప్పు ఉడకబెట్టిన
చిలకడదుంప తింటే ఒక రోజుకి
సరిపడా సి విటమిన్ అందుతుంది.
చిలకడ
దుంపలలో ఉండే అద్భుతమైన పోషకాలను
పరిశోధించిన పౌష్టికాహార నిపుణులు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సువాసనలు వెదజల్లుతూ చిలకడదుంపలు పలురంగులలో వివిధ ప్రాంతాల్లో పండుతాయి.
ఇందులో 35 శాతం నుంచి 90 శాతం
వరకు విటమిన్ ఎ ఉంటడం వల్ల,
ఇవి తింటే కళ్లకు మంచిది.
వీటిని తినడం వల్ల ఊపిరితిత్తుల
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని
ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.
చలి,
జ్వరాలు విజృంభించే చలికాలంలో విటమిన్లు పుష్కలంగా ఉండే చిలకడదుంపలు తినడం
ఎంతో అవసరం. పొట్టు తీయాకుండా ఉడికించిన దుంపలు తినడం ద్వారా 950 మిల్లిగ్రాముల
పోటాషియం దొరుకుతుంది.పిండిపదార్థం, చక్కెరలు అధికమొత్తంలో కలిగి ఉంటుంది. వారానికి
రెండుసార్లు తింటే మంచిది. అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు నివారిస్తుంది.
అలాగే రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఇవి తింటే చాలా
మంచిది.
Tags
Health & Fitness