సీఎం జగన్ స్టిక్కర్లు అంటించే పనిలో మన ఆర్టీవో అధికారులు ఫుల్ బిజీ


ద్వి చక్ర  మరియు ఇతర రవాణా వాహనాలను తనిఖీ చేయటం.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని సీజ్ చేయటం లాంటి పనులు చేయాల్సిన రవాణా శాఖ అధికారులు ఇప్పుడు కొత్త పని వార్తల్లో ఎక్కారు .

వివరాల్లో కి వెళ్ళితే మన ఆర్టీవో  అధికారులు తమ విధుల్ని వదిలేసి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచేందుకు వీలుగా రోడ్ల మీద పడ్డారు .  తమకిచ్చిన జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్లను ఆటోలకు అంటిస్తూ.. జగన్ సేవలో తరిస్తున్న వైనం తాజాగా వెలుగు లో కి  వచ్చింది.

ఇటీవల మన  ఏపీ ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వాహన మిత్ర పేరుతో కారు.. క్యాబ్.. ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున వాహన మిత్ర అనే పధకం ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే .ఈ  పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్లో వేయటం తెలిసిందే. పథకంలో భాగంగా రూ.10వేలు డ్రైవర్ల  అకౌంట్ లో  డబ్బులు వేసినప్పుడు అందుకు తగ్గట్లుగా ప్రచారం చేసుకోవాలి కదా? ఇందుకు తగ్గట్లు జగన్ కు థ్యాంక్యూ చెప్పేస్తున్న స్టిక్కర్లును రూపొందించారు.

వీటిని మన ఆర్టీవో అధికారుల చేత ఆటోల మీద తప్పకుండా అంటించే పనిని కట్టబెట్టారు. ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా  ఆపి.. తప్పనిసరిగా జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ ను అంటించుకోవాలని స్పష్టం చేస్తూ.. ఏపీ సీఎం జగన్ ఇమేజ్ బిల్డింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు  మన ఆర్టీవో అధికారులు.దీనికి సంబంధించిన ఒక వీడియో మన  సోషల్ మీడియా లో వైరల్ అయిన్ది . ఈ వీడియోలో ఆటో ఎక్కేటోళ్లు స్టిక్కర్లు చూస్తారా? అని ప్రశ్నించిన వ్యక్తికి.. రూ.10వేలు నీ బ్యాంకు అకౌంట్ లో వచ్చాయా? లేదా? అని అధికారులు అడగటం.. వచ్చాయన్న మాటకు.. మరి.. అలా అయితే స్టిక్కర్ను ఖచ్చితంగా  వేసుకోవాల్సిందే అన్న సమాధానం సదరు అధికారి నుంచి రావటం వీడియోలో వినిపించింది.

ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పథకాన్ని అమలు చేయటాన్ని ఎవరూ కాదలేరు. కానీ.. ముఖ్యమంత్రి ఫోటోలతో కూడిన స్టిక్కర్లను ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చి.. రోడ్ల మీద మరి నిలబెట్టి పని చేయిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال