వెనుజులా దిశగా ఏపీ అవుతుందా?

ప్రపంచంలో దివాళా చెందిన దేశాల్లో వెనుజులా ఒకటి . ఆయిల్ ఉత్పత్తితో ఒక దశలో  ఒక  వెలుగు వెలిగిన దేశం అది. అయితే విపరీతమైన సంక్షేమ  పథకాలు అవలంభించి  ఆ దేశం ఆర్థికంగా బాగా దెబ్బతిన్నదని అంటారు. సోషలిస్ట్ కంట్రీ అయిన వెనుజులా ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని,అక్కడ  ప్రభుత్వాలు దివాళా దిశగా పయనిస్తు ఉన్నాయని తరచూ వార్తలు మనం చూస్తునాం దానంతటికీ కారణం అతిగా సంక్షేమ పథకాలు అవలంభించడం చేత  అని పరిశీలకులు భావిస్తున్నారు .

ప్రస్తుతం అంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైందనది తెలుస్తున్న అంశమే. ఆదాయం లేదు - అంతకంతకూ మించి కొత్తగా సంక్షేమ పథకాలు, పెరుగుతున్న ఖర్చులు. ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి.

గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా - దాదాపు మూడు లక్షల రూపాయల వరకూ అప్పులు చేసినట్టుగా  ఆర్థిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. విభజన సమయంలో ఉన్న అప్పులకు చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం అనేక రెట్ల అప్పులను చేశారు .  ఆ డబ్బులు ఏమయ్యాయి అంటే.. ఆన్సర్ లేదు!

ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు - అద్భుతాలు చేసింది లేదు - అమరావతిలో ఇటుక పేర్చలేదు. అయినా లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే మిగిలింది.  ఇలాంటి నేపథ్యంలో..కొత్తగా ఏర్పడిన జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. పెన్షన్లు పెరిగాయి - జీతాలు పెరిగాయి - ఆర్టీసీ తోడయ్యింది.. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను రానున్న కాలంలో అమలు చేయబోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇదంతా ప్రభుత్వ ఖజానాకు భారమే అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్తగా ఆర్థిక వనరులను కనుక్కోవలసిన అవసరం ఉంది .  అదే జరగకపోతే.. ఏపీ ఆర్ధిక పరిస్థితి వెనుజులాలా తయారు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువేళ్ళుతుందో  చూడాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال