టాలీవుడ్
నటుడు రానా
గత కొంత కాలంగా అమెరికాలో
ఉంటున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల
వల్ల అమెరికా లో ట్రీట్మెంట్ కోసం
వెళ్లాడని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆయన ఒక
ఫోటో వైరల్ గా మారింది.
ఆ ఫోటో లో ఆయన
చాలా సన్నగా అయ్యారు. రానా ఈ ఆదివారం ఇండియాకి
వచ్చినట్టు ట్వీట్టర్ వేదిక గా తెలిపారు.
రానా
ప్రస్తుతం " హౌస్ ఫుల్ 4 " అనే
బాలీవుడ్ సినిమాలో విలన్
గా నటిస్తున్నారు. రీసెంట్
గా విడుదలైన ఈ " హౌస్ ఫుల్ 4 " ట్రైలర్
కు మంచి
స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ లో
రానా ఒక తోడేలు తో
ఫైట్ చేస్తూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా లో అక్షయ్
కుమార్, రితేష్ దేశ్ ముఖ్ , పూజా
హెగ్డే, కృతి సనన్ లు
ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ
సినిమా కి ఫర్హాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటి
అంటే ఓ ఆంగ్ల పత్రిక
రానా పై ఒక వార్త
వ్రాసింది ,ఆ వార్త ఆయనకు ఆగ్రహాన్ని తెచ్చింది
. విషయానికొస్తే
" హౌస్ ఫుల్ 4 " సినిమా కొంత భాగం షూటింగ్
లండన్ లో జరిగింది. లండన్
షెడ్యూల్ కి రానా తన
కుక్ ని తీసుకు
వెళ్లడని. రానా ఏలాంటి భోజనం
తింటాడో , ఏలాంటి డైట్ ఫాలో అవుతాడో తన
కుక్ కి బాగా
తెలుసని. లండన్ లో రానా బస
చేసిన హోటల్లో రానా
కోసం ప్రత్యేకంగా తన కుక్ వంటకాలు తయారు
చేసేవాడని రాసింది.ఈ విషయాన్ని ట్వీట్
కూడా చేసింది.
ఈ విషయం పై రానా
గట్టిగా స్పందించారు." నేను లండన్ లో
జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో నేను పాల్గొనలేదు.
మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు" అని
రానా ఆ పత్రిక ఫై
నా కొప్పడ్డారు.
దీంతో సదరు ఆంగ్ల పత్రిక
తన ట్వీట్
ను డిలీట్ చేసింది.
Tags
Movie News