రాధికా ఆప్టే మళ్ళీ హాట్ గా వార్తల్లోకెక్కింది. సోషల్ మీడియాలో ఆమె ఇటీవలి ఫొటోలు వైరల్‌గా మారడమే అందుకు కారణం. తాజాగా ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్లో ఇదిగో ఇలా ఆమె దర్శనమిచ్చిన రాధికా ఆప్టేపై సోషల్ మీడియాలో నెటిజన్లు గూస్ మని అంటున్నారు. 'ఇదేం హాట్ గ్లామర్ బాబోయ్..' అంటూ ట్రాలింగ్ షురూ చేస్తున్నారు . ఈ వ్యవహారం రాధికా ఆప్టే దాకా వెళ్ళింది.
'నా గ్లామర్ నా ఇష్టం.. నాకు కంఫర్ట్‌గా వుండేలా నా కాస్ట్యూమ్స్ ఉంటాయి మరి నేను వుంటాయి.. నేనెలా వుండాలనుకుంటానో అలాగే వుంటాను.. ఎవరో నా గురించి నెగెటివ్‌గా సోషల్ మీడియా లో కామెంట్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు..' అంటూ రాధికా ఆప్టే, తన గ్లామర్‌పై వచ్చిన ట్రాలింగ్ షురూ అవడాన్ని తప్పుపట్టింది. నిజమే కదా మరి ఆమె అందం ఆమె ఇష్టం. అదే సమయంలో, ఆమె గ్లామర్‌పై నెటిజన్లు కామెంట్ చేయకుండా, ఆమె అడ్డుకోలేదు కదా.!
మరి చెప్పుకోవాలంటే, ఈ మధ్యకాలంలో రాధికా మరీ 'బోల్డ్'గా వుండేందుకు ఇష్టపడ్తున్నట్లు మనకు అర్ధం అవుతుంది . తన బోల్డ్‌నెస్ చూపించెయ్యాలన్న ఆతృతతో వరస్ట్ డ్రస్సింగ్ వేసుకొంటూ వస్తుంది . అక్కడే వ్యవహారం తేడా కొట్టేస్తోందనుకోవాలేమో. ఇక్కడ, ఈమె డ్రెస్సింగ్ విషయంలోనూ అదే జరిగింది. తెలుగులో ఈ మధ్య రెండు సినిమాల్లో నటించిన రాధిక ఆ మధ్య ఆ రెండు తెలుగు సినిమాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందిలే
Tags
Movie News