మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పబ్లిసిటీ యావ కాస్త ఎక్కువే అన్నది అందరు అంగీకరించే విషయమే. ఆయన తనకు సంబంధించిన నడవిక మరియు ప్రతి విషయాన్నీ పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తారు. ఎలక్షన్స్ ముందు మానస సరోవరానికి వెళ్లి లోపల గుహలో ధ్యానం చేస్తున్నా దృశ్యాల్ని కూడా ఫొటోలు తీయించి ప్రచారం చేసుకున్న తీరును మన జనాలు మరిచిపోలేరు.
ఇంకా చాల సందర్భాల్లో మోడీ పబ్లిసిటీ యావ స్పష్టంగా బయటపడింది. ఐతే కొన్ని సందర్భాల్లో ఆయన పబ్లిసిటీ కోసం చేసే పనులు కూడా మన మంచికే ఉపయోగపడుతుంటాయి. తాజాగా మన మోడీ అలాంటి పనే ఒకటి చేశాడు. తాను ప్రధానిమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా అయన దృష్టిపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రచారం కల్పిస్తూ ఆయన తాజాగా ఒక మంచి పని చేశారు. ప్రస్తుతం మోడీ తమిళనాడు పర్యటనలో మహాబలేశ్వరం లో ఉన్న సంగతి తెలిసిందే.
నిన్న దాయాది దేశమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కలిసి మహాబలిపురంలో ఆలయాన్ని సందర్శించిన మోడీ.. ఈ రోజు ఉదయన్నే మామల్లాపురంలో బీచ్ దగ్గర వాకింగ్‌కు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వ్యర్థాలు,తాగేసి పడేసిన మందు బాటిల్స్ ఉండటంతో వాటిని శుభ్రం చేసే పనిలోకి దిగారు. అరగంట పాటు ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సాగింది. స్వయంగా చెత్తను ఏరి కవర్లలో వేస్తూఉన్నట్లు ఒక వీడియో తీయించి , ఆ వీడియోను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.
ఒక సామాన్యుడిలా మారిన మన ప్రధాని చెత్తను ఏరిన వైనం చూసి పరిసరాల శుభ్రతను పట్టించుకోని ప్రతి ఒక్కరికీ చెంపపెట్టే. ఇది కోట్ల మందికి ఒక గుణ పాఠం అనడంలో సందేహం లేదు. ఇది ఎంతోమందిలో స్వచ్ భారత్ పట్ల స్ఫూర్తి ని రగిలిస్తుందన్నదీ వాస్తవమే. మోడీ తన ప్రచారం కోసమే చేసినా కూడా ఇదెంతో స్ఫూర్తిదాయకమే. ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది.

Tags
Latest News