చలికాలంలో వచ్చే చుండ్రుకు అద్భుతమైన మన ఇంటి చిట్కాలు ...

చుండ్రు ఎన్ని విధాలుగా తరిమెయ్యాలని చుసిన ఎన్ని ప్రయోగాలు సరే అసలు పోదు. ఇంకా చలికాలంలో అయితే పరిస్థితి మరి దారుణం. ఎన్ని సార్లు మార్కెట్లో దొరికే షాంపూలతో తల స్నానం చేసిన అస్సలు వదలదు ఈ దారుణమైన చుండ్రు.. అయితే ఇలాంటి మొండి చుండ్రుకు మాములుగా చెప్తే సారిపోదు మరియు  ఇతర రసాయన మందులు వాడిన సరే అసలు పోదు. అయితే ఈ చుండ్రును సమూలంగా వదిలిoచుకోవాలంటే  సహజసిద్ధమైన మన ఇంటి చిట్కాలు పాటించి మొండి చుండ్రుకు ఈ చలికాలంలో గుడ్ బై చెప్పవచ్చు . ఈ చిట్కాలు ఏంటో చూడండి  .

బాగా పులిసిన పెరుగు, గోరింటాకు, గుడ్డులోని తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు బాగా పట్టించి ఒక గంట ఆరిన తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది. 

వేపాకు వేసి కాచిన వేడి నీటితో తలస్నానం చేసిన మొండి చుండ్రు అవుతుంది.

తలలో పేల సమస్య ఉన్నవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తుడుచుకొని సాంబ్రాణి పొగ వేస్తే పేల సమస్య వదిలిపోతుంది.

నిర్జీవంగా ఉన్న వెంట్రుకలు రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపిన కొబ్బరి నూనె రోజు రాస్తుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

నల్లని జుట్టు కావాలనుకునే వారు నిమ్మరసం, తులసి రసం , కరివేపాకు కలిపి నూరి తలకు బాగా పట్టిస్తే మంచి గుణం కనిపిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال