అసలు మనం ఎండ తగలకుండానే రోజు గడిపేస్తున్నారు. దీనివల్ల ఎండా ద్వారా శరీరానికి అందవలసిన విలువైన విటమిన్ డి ని కోల్పోతున్నారు. ఇలా ఏళ్ళు గడిచే కొద్దీ మన శరీరంకు కావలసిన విటమిన్ డి లోపించి పలు అనారోగ్యాల పాలవుతారు. శాఖాహారుల్లో ఈ విటమిన్ డి లోపం ఇంకా చాల ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్, క్లోమం క్యాన్సర్ల ముప్పు చాల ఎక్కువని పలు పరిశోధనలో రుజువైంది.
మన భారత దేశంలో 90 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిఒక్కరికి విటమిన్ డి అందలి. విటమిన్ డి లోపిస్తే శరీరంలో వచ్చే లోపాలను, మార్పులను, లక్షణాలను గురించి చదివి తెలుసుకోండి.
విటమిన్ డి శరీరానికి తగినంత అందితేనే కాల్షియాన్నివస్తుంది . విటమిన్ డి లోపం తలెత్తితే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడి ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. అధిక బరువున్నఉబకాయల్లో ఈ మార్పు మరింత వేగంగా కనిపిస్తుంది.
విటమిన్ లోపం ఉన్నవారిలో కండరాలూ, కీళ్ల నొప్పులూ చాల దీర్ఘకాలం బాధిస్తాయి.
కొందరు ఎన్నిఆహార నియమాలు పాటించినా, ఎక్కువ విశ్రాంతి తీసుకున్నా అలసటా, ఒత్తిడీ బాధిస్తూనే ఉంటాయి . అలాగే క్షణక్షణానికీ మనఃస్థితి, భావోద్వేగాలు మారిపోతాయి. తరచూ ఈ సమస్య కనిపిస్తుంటే అది విటమిన్ డి లోపం మనలో ఉందని గమనించాలి .
వాతావరణం చల్లగా పొడిగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, దురదగా, చిరాగ్గా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఉన్నట్టు గమనించాలి .
విటమిన్ డి నివారణకొరకు
ప్రతి రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో కనీసం అరగంట మన శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి.
రోజూ పాలూ, దానిమ్మ, నారింజ, చేపలూ, బాదం పప్పు, ఆకుకూరలూ.. అధిక మోతాదులో మన ఆహారంలో తీసుకుంటే ఈ లోపం పూర్తిగా నయమవుతుంది.
Tags
Health & Fitness