వాన కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

వానకాలం వచ్చేసింది. మన పిల్లలు అయితే వర్షం సినిమా చూసి అందులోలాగా వానలో ఎగరాలి, తడవాలి అని అనుకుంటారు. కానీ మన పెద్దలకు బాగా తెలుసు. వర్షం తడిస్తే ఎన్ని సమస్యలువస్తాయి అనేది. అందుకే మన పిల్లల్ని, వారు వానలో తడవకుండా చూసుకుంటారు. వానలో తడవకుండా వుండకూడదని ఎంత ప్రయతించిన సరే ఎలాగోలా ఒక్కక్కసారి తడుస్తాం. అంతే కాదు వర్షం వల్ల వచ్చే దోమలకు మనం రక్తం ఆహారం అవుతువుంటుంది.

చిన్నచిన్న వానలు పడిన సరే మన రోడ్లన్నీ బురదమయమైపోతుంటాయి , ఆ బురదపై గల చెత్తచెదారం కుళ్లి.. వాటి కారణంగా ప్రాణంతక వైరస్లు , బాక్టీరియా వ్యాపిస్తాయి. ఈ కాలంలోనే దోమల బెడదా బాగా పెరుగుతుంది. పరిశుభ్రత లోపించటం వల్ల శ్వాస, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి అవకాశాలు చాలా ఉన్నాయి . అందుకే ఈ వర్ష కాలంలో మన ఆరోగ్య పరిరక్షణన కోసం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలిన అవసరం ఎంతైనా ఉంది .

జాగ్రత్తలు.. 

మన ఇంటి పరిసరాల్లో వాననీరు నిల్వ కాకుండా చూసుకోవాలి.

ఇంట్లో ఎప్పటికి అప్పుడు బూజు, దుమ్ము, ధూళిని పూర్తిగా తొలిగించాలి, ఇలా చెయ్యడం వల్ల ,అల్లర్జీలు ,శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఈ సీజన్లో అతిగా కాఫీ,టీ బదులు తాగకుండా గోరువెచ్చటి నీరు తాగటం మంచిది. రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా తాగాలి.

వాననీటిలో తడిస్తే ఇంటికి రాగానే తలతుడుచుకోవాలి. వీలైతే వేడినీటితో తల స్నానం చేస్తే మంచిది.

వర్షాకాలంలో మిరియాలపొడి వేసిన కాషాయం వేడిగా తీసుకోవాలి.

ఆకుకూరలు, కూరగాయాలు ఉప్పు నీళ్లతో బాగా కడిగిన తరువాతే వండుకోవలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال