ఒకవైపు జనసేనలో పార్టీలో నేతలు మిగిలేలాలేరు. చాల మంది నేతలు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పొందలేకపోయారు. ఇప్పుడు వారు కూడా తమ తమ దారి చూసుకుంటూ ఉన్నారు. జనసేనకు స్టార్ నేతలుగా వెలుగొందిన వారిలోకొందరు కామ్ అయిపోగా, మరికొందరు వేరే పార్టీలను వెతుకొంటున్నారు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ మాత్రం ప్రెస్ నోట్ల రాజకీయం చేస్తూ ఉన్నారు.
ప్రెస్ నోట్లు రిలీజ్ చేసినంత తన బాధ్యత అయిపోతుందన్నట్టుగా పవన్ భావిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే అలాంటి రాజకీయాల ప్రెస్ నోట్లు ముచ్చటను జనాలు పట్టించుకునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మరోవైపు పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి చర్చకొనసాగుతూ ఉంది.
పవన్ సినిమాల్లో నటించాలని అన్నట్టుగా చిరంజీవి ఈ మధ్య వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి రామ్ చరణ్ ఒక సినిమాను రూపొందించాలనే ఆకాంక్షను చిరంజీవి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి కథ సిద్ధం అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి పని చేసుకోవాలనేది చిరంజీవి అభిప్రాయం కూడా.
ఎలక్షన్స్ తరువాత బడా నిర్మాతలు కూడా పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ప్రయత్నాల్లో ఉండనే ఉన్నారని మనకు తెలుసు. త్వరలోనే పవన్ మళ్లీ సినిమాకు ఓకే చెప్పి రంగంలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని పరిశీలకులు వాదన . ఎన్నికలు వచ్చేంత వరకూ పవన్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
Tags
Movie News