శ్రీదేవి బయోపిక్ కి రెడీ అంటున్న హీరోయిన్!

దివంగత నటి శ్రీదేవి బయోపిక్ సినిమా రూపొందిస్తే, అందులో శ్రీదేవి పాత్రను చేయడానికి తను రెడీ అని మిల్కీ బ్యూటీ తమన్నా అంటోంది. నాలుగు సంవత్సరాల కిందట హిందీలో ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా వచ్చింది. అది పాత తెలుగు సినిమాకు రీమేక్. తెలుగు లో హీరోయిన్ శ్రీదేవి. హిందీ వెర్షన్ రీమేక్ లో తమన్నా నటించింది. శ్రీదేవి చేసిన పాత్రను చేసింది. ప్రత్యేకించి ఒక పాట రీమిక్స్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది మిల్కీ బ్యూటీ .

ఇప్పుడు శ్రీదేవి పాత్రను చేయడానికి తాను రెడీ అంటోంది. మరి తమన్నాకు ఆ ఛాన్స్ ఎవరైనా ఇస్తారో ఇవ్వరో చూడాల్సి ఉంది. తమన్నా కోరిక తీరుతుందో లేదో కానీ.. ఇంకా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది తమన్నా .

ఈమె ఇటీవల నటించిన తమిళ సినిమా ‘పెట్రోమ్యాక్స్’ విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగులో హిట్టైన ఆనందోబ్రహ్మ సినిమాకు రీమేక్ ఈ సినిమా యిది . తమిళంలో తనది ముఖ్య పాత్ర ఏమీ కాదని, ప్రధాన పాత్ర మాత్రమే అని సినిమాలో ప్రధాన పాత్రలో గుండామణి కూడా నవ్విస్తాడని, ఆయన కామెడీని ఉద్దేశించే ఆ టైటిల్ పెట్టినట్టుగా తమన్నా చెబుతోంది.

అలాగే  తమిళం లో విశాల్ సరసన ఒక యాక్షన్ సినిమాలో నటించబోతున్నట్టుగా చెప్పింది. వరుసగా కొన్ని హారర్-కామెడీల్లో నటిస్తూ వస్తున్నా.. దెయ్యాలంటే భయం లేదంటోంది తమన్నా. దర్శకత్వం చేసే ఉద్దేశం లేదని కూడా లేదని అంటోంది. డైరెక్షన్ అంటే చాలా ఓపిక ఉండాలని, అంత ఓపిక తనకు లేదని చెబుతోంది!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال