ఆంధ్రా అమ్మాయితో అమెరికా అబ్బాయి పెళ్లి

మన అందరికి గుర్తే ఉంటుంది దాదాపు 32 ఏళ్ల క్రితం.. పడమటి సంధ్యారాగం అనే తెలుగు సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఒక పెద్ద సంచలనమే సృష్టించింది అనే చెప్పాలి .మన సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన ఒక తెలుగమ్మాయి.. ఒక అమెరికా అబ్బాయి ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం. ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో గొప్పగా విజయవంతమైంది.

అదే సీన్ రిపీట్ అయంది అనే చెప్పాలి .. తాజాగా ఆంధ్రాకు చెందిన మరో సంధ్య ఈసారి అమెరికా అబ్బాయిని ప్రేమించి.. ఘనంగా పెళ్లి చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సినిమాలో కథానాయకి విజయశాంతి పేరు సంధ్య మాదిరే ఈ బెజవాడ అమ్మాయి పేరు కూడా సంధ్యే కావటం విశేషం.

విజయవాడకి  చెందిన సత్యహరినాథరెడ్డి..జ్యోతి దంపతుల కుమార్తె నాగ సంధ్య. అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీలో పీహెచ్ డీ చేసింది. ఒరెగాన్ లోని ఇంటెల్ కార్పొరేషన్ లో టెక్నాలజీ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా పని చేస్తోంది. ఆమె ఉన్న ప్రాంతంలో ఆడం బ్యాంగ్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం.ఏర్పాడి ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది.

వీరి ప్రేమను అర్థం చేసుకున్న ఇరువూరు తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఎస్ అనటంతో.. తాజాగా విజయవాడలో ని  ఒక కల్యాణ మండపంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. తరచూ మనం ప్రాశ్చాత్య దేశాల యువతులు మన అబ్బాయిల్ని పెళ్లాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ కాస్త భిన్నంగా మన తెలుగుమ్మాయి.. అమెరికా అబ్బాయిని పెళ్లాడిన వైనం నాటి పడమటి సంధ్యారాగాo సినిమాను గుర్తు చేసింది ఇప్పటి సంధ్య. ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال