వరుసగా ఆరు రోజులు పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గుతు వస్తున్నాయి . 10 పైసలు, 15 పైసలు ప్రకారం దాదాపు రూపాయి వరుకు తగ్గింది పెట్రోల్, డీజల్ ధరలు. అయితే నిన్నటి వరుకు భారీగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజల్ ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దిగొచ్చినా కూడా దేశీ ఇంధన ధరలు తగ్గలేదు.
ఈ బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి . దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.25 వద్ద, డీజిల్ ధర రూ.72.85 వద్ద స్థిరంగా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. పెట్రోల్ ధర స్థిరంగా రూ.77.85 వద్ద డీజిల్ ధర రూ.72.12 వద్దనే నిలకడగా ఉంది.
అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం అనేది ఈరోజు ప్రభావం చూపకపోవడం వలన రేపు కానీ మరి వచ్చే రెండు రోజుల్లో ప్రభావం చూపచ్చు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి పెట్రోల్ డీజిలు ఎంతమాత్రం తగ్గాయి అనేది రేపు చూస్తే తెలుస్తుంది. కాగా దేశంలోనే చాల సంవత్సరాల తరువాత అతి తక్కువ ధరతో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి.
అది ఎక్కడో కాదు మన దేశ రాజధాని న్యూ ఢిల్లీ మార్కెట్ లో పెట్రోల్, డీజల్ ధరలు అతి తక్కువ ధరలో తగ్గాయి. పెట్రోల్ ధర రూ.73.59 వద్ద, డీజిల్ ధర రూ.66.81 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
Tags
Latest News