అదిరిపోయే కొత్త ఫీచర్స్ తో మోడీ కొత్త విమానం

మన భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. ప్రధాని దేశ విదేశీ పర్యటనల కోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన మిస్సైల్ వ్యవస్థ ఉన్న బోయింగ్ బీ-777 విమానాలను భారత్ కొనుగోలు చేసింది .  ప్రధాని మోడీతో పాటు ఇతర మంత్రులు మరియు వీవీఐపీల కోసం రెండు బోయింగ్ బీ777లను భారత్ ఆర్డర్ ఇచ్చింది. వచ్చే ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం ప్రధాని పర్యటనలో ఆయన వాడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ బీ747 విమానాలను మన ఎయిరిండియా పైలెట్లు నడిపేవారు. ఇప్పుడా బాధ్యతను ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు అప్పగించారు.

అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ గాంచిన బోయింగ్ సంస్థ భారత ప్రధాని సహా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ,ఇతర కేంద్ర మంత్రులు వీఐపీల కోసం ఈ రెండు బీ777 విమానాలను తయారు చేస్తోంది. ఈ విమానంలో అత్యాధునికమైన మిస్సైల్ వ్యవస్థ ఉంది. ఈ రెండు డిఫెన్స్ వ్యవస్థలను కలిగిని విమానాల కోసం 190 మిలియన్ డాలర్లకు భారత్ కు అమ్మేందుకు అమెరికా బోయింగ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే బీ777 విమానాన్ని అత్యాధునిక టెక్నాలజీతో బోయింగ్ సంస్థ తయారు చేసి భారత్ కు ఇస్తోంది.

ఇక నుంచి భారత ప్రధాని పాటు వీవీఐపీలు ప్రయాణించే ఈ సరి కొత్త విమానాన్ని క్షిపణులు పేల్చినా తప్పించుకునేలా గట్టి భద్రతతో రూపొందించారు. తిరిగి ఎదురుదాడి చేయగల సామర్థం ఈ విమానం సొంతం..  ఇప్పటికే ఈ బీ777 విమానాన్ని నడిపేందుకు 6 ఎయిర్ ఫోర్స్ పైలెట్లకు శిక్షణ కూడా ఇప్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال