ఇండియన్ క్రికెటర్ తో హన్సిక ప్రేమాయణం


అతి పిన్న వయసులోనే వెండి తేరకు  పరిచయమైన హన్సిక మోత్వానీ అతితక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించి సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా చాలా కాలం ఒక వెలుగు వెలిగింది . సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనే చాల మంది స్టార్ హీరోల పక్కన నటించే బ్లాక్ బస్టర్ లు అందుకుంది. ముఖ్యంగా తెలుగులో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ తో నటించిన ‘దేశముదురు’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న హన్సిక చాలా వరకు కెరియర్ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవటం జరిగింది. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో నే లిటిల్ సూపర్ స్టార్గా పేరుపొందిన శింబు మరియు ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోలతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తల్లోకెక్కింది. అయితే ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో కెరియర్ పరంగా అవకాశాలు తగ్గుతూ వస్తు ఉన్నఈ  నేపథ్యంలో తాజాగా ఆమెపై ఒక వార్త తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

 అదేమిటంటే హన్సిక ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి . ప్రస్తుతం హన్సిక ఎక్కువగా హారర్ నేపథ్యంలో ఉన్న సినిమాలు పెంచుకుంటూ చేస్తూ వస్తుంది. ఇటువంటి క్రమంలో హారర్ నేపథ్యం కలిగిన సినిమాలో హన్సిక సరసన మాజీ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. అది కూడా విలన్ పాత్రలో కావడం విశేషం. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు తమిళ దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 శ్రీశాంత్ క్రికెట్ కు దూరం అయిన తర్వాత...మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీకి దగ్గర అయ్యి ఇటీవల మంచి మంచి సినిమాలు చేస్తూ కెరీర్ని రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో శ్రీశాంత్ ‘టీమ్ 5’ అనే సినిమా చేయడం జరిగింది. కాగా హన్సిక తో చేస్తున్న సినిమా విడుదల కాకముందే వీరిద్దరిపై ఇటువంటి వార్తలు వస్తున్న క్రమంలో వీరిద్దరు చేసిన సినిమాపై కూడా తమిళ్ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మరోపక్క హన్సిక తెలుగు కుర్ర హీరో సందీప్ కిషన్ సరసన ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ సినిమాలో నటిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال