మల్లేశం'హీరోయిన్ తమిళం ఎంట్రీ
మల్లేశం' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇంచ్చిన హైదరాబాద్ బ్యూటీ అనన్య నాగళ్ల సుపరిచితురాలే. తొలి సినిమా 'మల్లేశం'తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్'.. 'వకీల్ సాబ్' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న 'శాకుంతలంలో' నటిస్తోంది.
అయితే టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలన్న తన కల మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది. తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించలేదు అనడానికి అనన్యని మరో ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే అందుకు అనే కారణాలుంటాయి. కోట్ల రూపాయల ఖర్చు. క్రియేటర్ విజన్కి దగ్గరగా నటి ఉండాలి. ఇంకా ఇతర చాలా రీజన్స్ ఉంటాయి. అనన్య ఈ విషయంలో ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ కి ప్రమోట్ అయినట్లు తెలుస్తోంది. తమిళ హీరో శషి కుమార్ నటించే చిత్రం ద్వారా అమ్మడు కోలీవుడ్ లో పరిచయం అవుతుంది. 'అంజల్' ఫేం తంగం పా. శరవణన్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనన్య శిశకుమార్ సరసన నటిస్తుంది. హీరోతో..హీరోయిన్ రొమాన్స్ ఎక్కువగానే ఉంటుంని సమాచారం.
దర్శకుడు ఈ విషయాలు ముందే చెప్పి అనన్యని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదొక ట్రావెల్ స్టోరీ అని సమాచారం. దక్షిణాదిన అన్ని రాష్ర్టాల చుట్టూ ఈ కథ తిరుగుతుందిట. మొత్తానికి అనన్యకి వచ్చిన అవకాశమైతే మంచిదనే తెలుస్తోంది.