జీ5 యాప్ లో “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్
హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన భారీ సినిమా “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్”. మార్వెల్ స్టూడియోస్ నుంచి అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మళ్ళీ అంత మోస్ట్ అవైటెడ్ గా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం వారి నుంచి మరో భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది.
ముఖ్యంగా ముగ్గురు స్పైడర్ మ్యాన్ ల కలయికతో చాలా హైప్ తెచ్చుకున్న ఈ సినిమా అందరి అంచనాలను నిజం చేసి భారీ మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లను అందుకుంది. ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఓటిటి లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు.
మరి దానికి గాను సోని లివ్ లో ఈ సినిమా అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తుంది అని కన్ఫర్మ్ కాగా ఇప్పుడు. ఈ సినిమాని స్ట్రీమింగ్ యాప్ జీ5 లో కూడా స్ట్రీమింగ్ కి తీసుకు రానున్నట్టు తెలుస్తుంది.
జీ5 మరియు సోనీ సంస్థలు కలయిక మూలాన ఈ భారీ సినిమా జీ 5 లో కూడా త్వరలో మన దేశపు అన్ని ముఖ్య భాషల్లో స్ట్రీమింగ్ కి రానుందట.