వేసవిలో వడదెబ్బ నుంచి కాపాడే ఆహారాలివే!
' వేసవిలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు * వడదెబ్బ తగలకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు గుమ్మడికాయ, దోసకాయ తినాలి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. * సబ్జా గింజలల్లో పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలోని
వేడిని తగ్గించి చల్లగా ఉంచుతాయి * నారింజ, నిమ్మకాయలు వంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు బాగుంటాయి
* పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల అవి శరీరం లోపలి నుండి మీకు తాజాదనాన్ని అందించేందుకు సహాయపడతాయి. శరీరాన్ని కూల్ గా ఉంచుతాయి.
* ఇంకా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటే మీకు అలసట అనేదే తెలీదు. శరీరం చల్లగా ఉంటుంది. * వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉల్లిపాయను మెత్తగా నూరి శరీరానికి రాయాలి
'జీలకర్ర దోరగా వేయించి పొడిచేయండి. అర స్పూన్ పొడిని ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగితే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది.
Tags
Health & Fitness