డాండ్రఫ్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
* నిజంగా ఎంతోమంది చుండ్రుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
* కొన్ని సార్లు ఒత్తిడి కారణంగా తల మీద చుండ్రు వస్తూ ఉంటుంది.
* చుండ్రు పోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం...
* వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి.
ఆలివ్ ఆయిల్లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి * నిమ్మ ఆకులను పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్ మాదిరిగా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి
* అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి.
ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి
* తలకు అలోవెరా జెల్ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది
* మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి * అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఇలా చేయాలి
* తాజా వేపాకులను మెత్తగా నూరి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత
తలస్నానం చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది.
* మందార ఆకులు, పువ్వు రేకులను పేస్ట్ చేసి ఒక సహజ కండీషనర్ లా ఉపయోగించొచ్చు. జుట్టు నల్లగా మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
Tags
Health & Fitness